మహేష్ బాబును మించిపోయేలా...కోట్లు ఖర్చు పెట్టి ఆర్డర్ చేసిన అల్లు అర్జున్!
ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఖరీదైన కారావ్యాన్ కలిగిన ఉన్న స్టార్ ఎవరు? అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్ల క్రితమే మహేష్ బాబు అత్యంత ఖరీదైన కారావ్యాన్ కొనుగోలు చేశారు. దాదాపు రూ. 3 నుంచి 4 కోట్ల ఖర్చుతో స్పెషల్‌గా కారావ్యాన్ డిజైన్ చేయించుకున్నారు.
అయితే త్వరలో టాలీవుడ్లోకి దాన్ని మించిన, ఖరీదైన, అత్యధునిక హంగులు కలిగిన కారావ్యాన్ రాబోతోంది. ప్రస్తుతం ముంబైలో సిద్ధం అవుతున్న ఇది మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ రాబోతోంది. దీన్ని ఆర్డర్ చేసింది మరెవరో కాదు... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

అల్లు అర్జున్ కారావ్యాన్ ఖరీదు ఎంతంటే...?
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ రూ. 7 కోట్ల ఖర్చుతో కొత్త కారావ్యాన్ డిజైన్ చేస్తున్నారని సమాచారం. అత్యంత లగ్జరీగా, అధునిక సదుపాయాలతో ఇది ఉంటుందట. బన్నీ టేస్టుకు తగినప విధంగా దీన్ని డిజైన్ చేయిస్తున్నట్లు సమాచారం.

త్రివిక్రమ్ షూటింగ్ ఇదే కారావ్యాన్లో...
అల్లు అర్జున్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభం కాబోయే మూవీ షూటింగులో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి ఈ కారావ్యాన్ సెట్లో ఉంటుందని, ప్రస్తుతం ముంబైలో దీనికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.

బన్నీ-త్రివిక్రమ్ మూవీ
‘నా పేరు సూర్య' తర్వాత అల్లు అర్జున్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఆ మూవీ బాక్సాఫీసు వద్ద పరాజయం పాలవ్వడంతో కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చివరకు త్రివిక్రమ్ చెప్పిన కథకు ఫిక్స్ అయ్యారు. ఇందులో బన్నీ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారట.

ఏప్రిల్‌లో ప్రారంభం
ఏప్రిల్ రెండో వారంలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆ తర్వాతే సినిమా లాంచ్ చేస్తారని టాక్. ఈ చిత్రాన్ని హారిక హాసిన ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ భారీగా నిర్మించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications










