అల్లు అర్జున్‌కు కరోనావైరస్ పాజిటివ్.. ఆందోళన చెందవద్దని ట్వీట్

టాలీవుడ్ సినీ ప్రముఖులను కరోనావైరస్ వెంటాడుతున్నది. చాలా మంది సినీ ప్రముఖులు కోవిడ్‌కు బలి అయ్యారు. అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కోలుకోగా, పూజా హెగ్డే, తదితరులు కోవిడ్ బారిన పడి కోలుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

తనకు కరోనావైరస్ సోకిన విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ.. నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నాకు నేనుగా స్వీయ గృహనిర్బంధంలో ఉన్నాను. గత కొద్ది రోజులుగా నాతో కలిసిన వ్యక్తులు టెస్టులు చేయించుకోండి. నేను బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఎవరూ బెంగపెట్టుకోవద్దు. మీరు ఇంటి వద్దనే ఉంటూ సురక్షిత చర్యలు తీసుకోండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

Stylish Star Allu Arjun tested coronavirus positive

ఇక అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. గతేడాది అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకొన్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ బర్త్ డేను పురస్కరించుకొని టీజర్‌ను రిలీజ్ చేయగా రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X