ఆదిలాబాద్‌లో అల్లు అర్జున్ సందడి.. కుంతల జలపాతం వద్దకు స్టైలిష్‌స్టార్

లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు ఇప్పుడు ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు సిద్దమవుతున్నారు. గత ఐదారు నెలులుగా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్‌లో స్టైలిష్ స్టార్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అర్జున్ ఆదిలాబాద్ పర్యటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్ సందడితో ఫ్యాన్స్‌లో ఉత్సాహం

అల్లు అర్జున్ సందడితో ఫ్యాన్స్‌లో ఉత్సాహం

పచ్చని పల్లె వాతావరణం, జలపాతాలతో కళకళలాడే ఆదిలాబాద్ జిల్లాలో అల్లు అర్జున్ పర్యటనకు వచ్చారనే విషయం తెలుసుకొన్న సినీ అభిమానులు వందల సంఖ్యలో తరలివచ్చారు. అల్లు అర్జున్ చూసి కేరింతలు కొట్టారు. మొబైల్‌ ఫోన్‌లో వారిని బంధించేందుకు తంటాలు పడ్డారు. భారీగా తరలివచ్చిన అభిమానుల కోసం కారుపైకి ఎక్కి అభివాదం చేశారు.

ఎర్ర చందనం మొక్కను నాటిన స్టైలిష్ స్టార్

ఎర్ర చందనం మొక్కను నాటిన స్టైలిష్ స్టార్

ఆదిలాబాద్ పర్యటనలో అల్లు అర్జున్ కుంతలా జలపాతాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. అనంతరం అక్కడే ఉన్న హరితవనం పార్కులోకి వెళ్లి చుట్టూ కలియదిరిగారు. ఆ పార్కులో ఎర్రచందనం మొక్కను నాటారు. అనంతరం పార్కు నిర్వాహకులు ఈ మొక్కను నాటింది అల్లు అర్జున్ అంటూ ఓ బోర్డును పెట్టారు.

లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా

లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా

ఆదిలాబాద్‌ పర్యటనలో అల్లు అర్జున్ సోషల్ డిస్టెన్స్ లాంటివి, అలాగే లాక్‌డౌన్ రూల్స్‌ను పక్కాగా పాటించారు. AA పేరుతో సొంతంగా తయారు చేయించుకొన్న మాస్క్‌ను ధరించారు. కారులో స్టైలిష్ స్టార్ ఉండగా అభిమానులు పోటీ పడి ఫోటోలు తీసుకొన్నారు.

సుకుమార్‌తో పుష్పగా అల్లు అర్జున్

సుకుమార్‌తో పుష్పగా అల్లు అర్జున్

అలవైకుంఠపురం చిత్రం తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్‌తో జతకట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కథా నేపథ్యంగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. అయితే లాక్‌డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే షూటింగులు మొదలు పెడుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లడంతో లొకేషన్ల చూడటానికి వెళ్లి ఉంటారనే వాదన సినీ వర్గాల్లో మొదలైంది.

Recommended Video

Bigg Boss Telugu 4 Episode 5 Highlights దివి, అమ్మా రాజశేఖర్ రొమాంటిక్‌గా
సినీ తారలను ఆకర్షిస్తున్న ఆదిలాబాద్ టూరిజం

సినీ తారలను ఆకర్షిస్తున్న ఆదిలాబాద్ టూరిజం

ఇటీవలి కాలంలో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రకృతి అందాలను పలువురు సినీ తారలు ఆస్వాదిస్తూ వస్తున్నారు. రానా దగ్గుబాటి, రాజమౌళి, అనుష్క శెట్టి లాంటి నటులు కూడా ఆ ప్రాంతాల్లో షూటింగ్ చేసి వచ్చారు. సహజమైన ఆటవీ సంపద ఇప్పుడు సినీ తారలతోపాటు పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X