చైతూ, సమంత పబ్లిక్‌లో కొట్టుకుంటుంటే... నేను సైడైపోయా: సుధీర్ బాబు

సమ్మోహనం తర్వాత సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. తన సొంత బేనర్ సుధీర్ బాబు ప్రొడక్షన్స్‌పై ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్‌గా సుధీర్‌బాబు న‌టించ‌గా.. అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ నటించారు. సెప్టెంబర్ 21న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సుధీర్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగ చైతన్య, సమంత గురించి కూడా ఫన్నీ సెటైర్ వేశారు.

మార్కెట్ గురించి ఆలోచించలేదు

మార్కెట్ గురించి ఆలోచించలేదు

నేనెప్పుడూ మార్కెట్ గురించి ఆలోచించను. స్క్రిప్టు ఎంచుకునేప్పుడే నా మార్కెట్‌కు తగిన విధంగా ఎంచుకుంటాను. ప్రొడక్షన్లోకి దిగిన తర్వాత ఏ సీన్ కోసం ఎంత పెట్టాలి అని ఆలోచించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్లిపోయాను... అని సుధీర్ బాబు తెలిపారు.

సినిమాపై పూర్తి నమ్మకం ఉంది

సినిమాపై పూర్తి నమ్మకం ఉంది

ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అవ్వాలనే దానికంటే నా బేనర్ నుండి ఒక మంచి సినిమా రావాలి, ఈ సినిమాకు పని చేసిన వారికి మంచి సక్సెస్ రావాలి అని ఆలోచించి ఈ సినిమా చేయడం జరిగింది. ‘నన్ను దోచుకుందువటే' సినిమా మంచి ఫలితాలను ఇస్తుందనే నమ్మకం ఉంది అని సుధీర్ బాబు.

చైతు, సమంత పబ్లిగ్గా కొట్టుకుంటున్నారు

చైతు, సమంత పబ్లిగ్గా కొట్టుకుంటున్నారు

ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేస్తాను అని అందరికంటే ముందు అనౌన్స్ చేశాను. కానీ వాళ్ల సినిమాలు సమయానికి అవ్వక నేను అనుకున్న డేట్ మీదకు వచ్చారు. మరో కారణం ఏమిటంటే... వైఫ్ అండ్ హస్బెండ్ పబ్లిక్‌లో కొట్టకుంటారు. ‘శైలజారెడ్డి అల్లుడు'... ‘యూ టర్న్' సినిమాలు పబ్లిక్‌గా ఫైట్ చేసుకుంటున్నాయి. అలా ఉన్నపుడు మనం మధ్యలోకి వెళ్లి వేలు పెట్టి కాల్చుకోకూడదు... అనుకున్నాను అని సుధీర్ బాబు తెలిపారు.

 నన్ను దోచుకుందువటే..

నన్ను దోచుకుందువటే..

సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డిఓపి - సురేష్ రగుతు, మ్యూజిక్ డైరెక్టర్ - అజనీష్ బి లోకనాథ్, ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి, ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్, పిఆర్ఓ - ఏలూరు శ్రీను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్. సాయి వరుణ్, నిర్మాత - సుధీర్ బాబు, డైరెక్షన్ - ఆర్ ఎస్. నాయుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X