ఇద్దరం కొట్టుకున్నాం ఇక అది కూడా చేయాలి.. యంగ్ హీరో కామెంట్స్
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చాడు సుధీర్ బాబు. అయితే అనతి కాలంలోనే సొంత కాళ్లపై నిలబడి ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టేశాడు. చిన్న సినిమాలను నిర్మిస్తూ తన కొత్తవాళ్లకు వంతు సాయం చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు ఓ చిత్రాన్ని కూడా నిర్మించాడు. అది కాసేపు పక్కనబెడితే అతను మంచి డ్యాన్సర్ ఫైటర్ అన్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు డ్యాన్సులకు బాలీవుడ్ హీరో పరేషాన్ అయ్యాడు. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.
సుధీర్ సినిమాల్లోని బెస్ట్ డ్యాన్స్ మూమెంట్స్‌కు సంబంధించి ఓ వీడియోను సుధీర్ బాబు ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోపై స్పందించిన సుధీర్ బాబు మీకు నచ్చిన బెస్ట్ డ్యాన్స్ మూమెంట్ ఏంటో చెప్పండి అంటూ ఫ్యాన్స్‌ను కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ట్వీట్‌పై బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ స్పందించాడు. వీరిద్దరి మద్య మంచి స్నేహముందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి వర్షం రీమేక్ (బాఘీ)లో నటించిన సంగతి తెలిసిందే. ఆ రీమేక్‌లో సుధీర్ బాబు విలన్‌గా గోపీచంద్ పాత్రను పోషించాడు. అలా ఆ చిత్రంతో టైగర్, సుధీర్ మధ్య స్నేహం ఏర్పడింది. తాజగా సుధీర్ డ్యాన్సులకు టైగర్ ఫిదా అయ్యాడు. ఈ మేరకు సుధీర్ స్పందిస్తూ.. మన ఇదివరకు కొట్టుకున్నాం..ఇక కలిసి స్టెప్పులు వేయాలి అది కూడా త్వరలోనే జరగాలని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











