జ్యోతిక సినిమా కోసం సుధీర్‌బాబు.. ఏం చేశారో తెలుసా?
తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ఝాన్సీ పేరుతో విడుదలకు సిద్ధం అవుతుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించగా సన్సేషనల్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో నిర్మించబడిన ఈ చిత్రాన్ని తెలుగులో కోనేరు కల్పన, డీ అభిరాం అజయ్‌కుమార్ రూపొందించారు. కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్ర టీజర్‌ను సమ్మోహనం చిత్రంతో మంచి విజయం సాధించిన యువ హీరో సుధీర్ బాబు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ.. టీజర్ చాల బాగుంది. జ్యోతికను పోలీస్ ఆఫీసర్‌గా చూస్తుంటే ఆమె భర్త సూర్య గుర్తుకొస్తున్నారు. పోలీస్ సినిమా అంటే సూర్య గుర్తుకు రావడం కంపల్సరీ. ఇప్పుడు వారి సతీమణి జ్యోతిక కూడా పోలీస్ ఆఫీసర్‌గా సినిమా చేయటం చాల ఆనందంగా ఉంది. తమిళంలో ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

ప్రస్తుతం తెలుగులో ఝాన్సీ అనే పవర్ ఫుల్ టైటిల్ తో మన ముందుకు వస్తుంది. టీజర్ చూశాక సినిమా ఖచ్చితంగా చూడాలేని ఫీలింగ్ కలుగుతున్నది. తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలు కోనేరు కల్పన, డీ అభిరాం అజయ్ కుమార్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
జ్యోతిక టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్, జీవీ ప్రకాష్ అద్భుత నటన, ఇళయరాజా సంగీతం ఈ చిత్రం సక్సెస్‌రే ప్రధాన కారణమైంది.


Click it and Unblock the Notifications











