సుధీర్ బాబు షాకింగ్ న్యూ లుక్.. గడ్డం, హెయిర్ స్టైల్ అదిరింది!
హీరో సుధీర్ బాబు గెటప్ మార్చాడు. సుధీర్ బాబు తాజా లుక్ షాక్ ఇచ్చే విధంగా ఉంది. గుబురుగా గడ్డం, కొత్త హెయిర్ స్టైల్ తో అదరగొడుతున్నాడు. సుధీర్ బాబు తాజా లుక్ కొత్త సినిమా కోసమే అనే ప్రచారం జరుగుతోంది. సమ్మోహనం, నన్ను దోచుకుందువటే వంటి చిత్రాలతో సుధీర్ బాబు విజయాలు అందుకున్నాడు.
సుధీర్ బాబు నటించిన మల్టీస్టారర్ చిత్రం వీరభోగ వసంత రాయులు అక్టోబర్ 26న విడుదలకు సిద్ధం అవుతోంది. హీరోలు గడ్డం లుక్ లో కనిపించడం ప్రస్తుతం ట్రెండ్. అదే ట్రెండ్ ని సుధీర్ బాబు కూడా ఫాలో అవుతున్నాడు.

ప్రస్తుతం సుధీర్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సుధీర్ బాబు తదుపరి చిత్రానికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది. సమ్మోహనం, నన్ను దోచుకుందువటే చిత్రాలు తక్కువ గ్యాప్ లోనే విడుదలై విజయం సాధించాయి.


Click it and Unblock the Notifications











