Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'శ్రీదేవి సోడా సెంటర్'కు సాలీడ్ ఆఫర్.. విడుదలకు ముందే బడ్జెట్ లాగేసిన సుధీర్ బాబు!
ఘట్టమనేని బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ హీరో సుధీర్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైమ గుర్తింపును అందుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త విభిన్నమైన సినిమాలను చేస్తున్నాడు. ఇక సినిమాలు ప్లాప్ అయినా కూడా సుధీర్ బాబు నటనకు ప్రతిసారి మంచి మార్కులే పడుతున్నాయి. ఇక త్వరలో మరొక హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు.
కరుణ కుమార్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేస్తున్న సుధీర్ బాబు టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేశాడు. ఫిట్నెస్ కూడా పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది. మాస్ అంశాలతో పాటు ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఆ సినిమాకు ఇటీవల ఒక మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఆల్ మోస్ట్ సినిమాపై పెట్టిన బడ్జెట్ మొత్తం వెనక్కి వచ్చేలా 9కోట్లకు డీల్ క్లోజ్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇక సినిమా విడుదల తరువాత థియేట్రికల్ గా వచ్చే కలెక్షన్స్ బోనస్ అని చెప్పవచ్చు. చూస్తుంటే సుధీర్ బాబు మెల్లగా తన మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక సుధీర్ బాబు తనకు సన్నిహితుడైన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేస్తున్నాడు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే టైటిల్ తో రాబోతున్న ఆ రొమాంటిక్ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.