సుడిగాలి సుధీర్‌కు మంచి రోజులు.. కరోనాతో కలిసి వచ్చిన అదృష్టం!

టాలీవుడ్‌లోనైనా, టెలివిజన్ రంగంలోనైనా అఫైర్ వార్తలకు, డేటింగ్ రూమర్లకు, గాసిప్స్ కేరాఫ్ అడ్రస్ సుడిగాలి సుధీర్. యాంకర్ రష్మీ గౌతమ్‌తో అఫైర్ అంటూ వార్తలు మొదలుపెడితే మొన్నమొన్నటి వరకు విదేశీ వనితతో డేటింగ్ వార్త వరకు మీడియాలో హల్‌చల్ చేశాడు. అయితే తన పెళ్లి వ్యవహారం సీరియస్‌గా మారిందనే విషయాన్ని సుడిగాలి సుధీర్ ఇటీవల ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్లి గురించి ఇంట్లో వాళ్లు చేస్తున్న హంగామా ఇదే..

గాసిప్స్ పట్టించుకోకుండా రష్మీతో కెమిస్ట్రీ

గాసిప్స్ పట్టించుకోకుండా రష్మీతో కెమిస్ట్రీ

గత రెండు, మూడు సంవత్సరాల నుంచి రష్మీ, సుధీర్ ప్రేమ వ్యవహారంపై లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. అయితే వారిద్దరి అలాంటి వార్తలు పట్టించుకోకుండా బుల్లితెరపై కెమిస్ట్రీని పండిస్తూనే ఉన్నారు. సుధీర్ తనవంతుగా ఎదో ట్రై చేస్తున్నట్టు కనిపించినా.. రష్మీ మాత్రం పట్టించుకొనట్టు వ్యవహరించడం వీరి కెమిస్ట్రీ మధ్య గమనించాల్సిన వ్యవహారం.

వర్షిణి, విష్ణుప్రియతో డేటింగ్ అంటూ

వర్షిణి, విష్ణుప్రియతో డేటింగ్ అంటూ

ఆ తర్వాత తన తోటి యాంకర్లతోనూ సంబంధాలు అంటగడుతూ వార్తలు వచ్చాయి. వర్షిణి, విష్ణు ప్రియతో డేటింగ్ వార్తలకు ఏ మాత్రం కొదువ లేదు. అయితే సుడిగాలి సుధీర్ మాత్రం పెద్దగా పట్టించుకొన్నట్టు కనిపించారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడూతూ.. ఇలాంటి వార్తలు నాకు అలవాటైపోయాయి. మొదట్లో కొంత కంగారుగా ఉండేది. ఇప్పుడు ఇలాంటి వార్తల రాకపోతే భయంగా ఉందనే మాటను బయటపెట్టారు.

తాజాగా విదేశీ వనితతో అఫైర్ అంటూ

తాజాగా విదేశీ వనితతో అఫైర్ అంటూ

తాజాగా విదేశీ వనితతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తను కూడా ఖండించారు. తనకు అలాంటి అఫైర్ లేదని స్పష్టం చేశారు. కాకపోతే ఇంట్లో వాళ్లు తనకు పెళ్లి చేయాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. కానీ తానే చేసుకోవడం లేదని వాయిదా వేస్తూ వచ్చాను. ఈ మధ్య కాలంలో తన తల్లి నుంచి పెళ్లి గోల ఎక్కువైందని సుధీర్ చెప్పారు.

Recommended Video

Nani Vs Vijay Devarakonda Fans | V Teaser | World Famous Lover
కరోనాతో ఫేట్ మారిందని..

కరోనాతో ఫేట్ మారిందని..

ఇప్పుడు కరోనా పరిస్థితుల వల్ల నాకు మంచి అవకాశం దొరికింది. ఇటీవల ఓ సంబంధం గురించి అమ్మ మాట్లాడితే కుదరదని స్పష్టంగా చెప్పాను. కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఓ ఏడాదిపాటు పెళ్లి వాయిదా వేయమని ఇంట్లో వాళ్లకు చెప్పేశాను. మరో ఏడాది వరకు పెళ్లి మాట ఎత్తే అవకాశం ఉండదు అని సుధీర్ చెప్పారు. దీంతో కరోనా వల్ల అందరికీ కష్టాలు వస్తే సుధీర్‌కు మాత్రం సంతోషం కలిగిందని సన్నిహితులు ఆటపట్టిస్తున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X