Allu Arjun: ఆ హీరో నుంచి పుష్ప మేనరిజం కాపీ కొట్టిన అల్లు అర్జున్... వీడియో చూశారా?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత సంచలనం రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గల్లీ నుంచి వరల్డ్ వైడ్ స్టార్స్ వరకు పుష్ప మేనరిజాన్ని అనుసరిస్తూ రచ్చలేపారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అయితే బన్నీ ఇందులో ప్రదర్శించిన మేనరిజం.. 20 ఏళ్ల క్రితమే ఓ స్టార్ హీరో చేసేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్స్.. బన్నీ కాపీ కొట్టాడా ఏంటి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రభంజనం...:మెగా కాంపౌండ్ నుంచి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత తన స్టైల్, నటన, డ్యాన్సింగ్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు హీరోగా, స్టైలీష్ స్టార్ గా... ఎదుగుతూ ప్రస్తుతం ఐకానిక్ స్టార్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత ఒక్కో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వస్తున్న ఈ హీరో... కరోనా టైంలో పుష్ప సినిమాతో ప్రభంజనం సృష్టించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

తగ్గేదేలే.. గల్లీ నుంచి దిల్లీ వరకు..:అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్టుగా పుష్ప నిలిచి... కలెక్షన్ల సునామీ సృష్టించింది. పాన్ ఇండియా లెవల్‌లో అల్లు అర్జున్ పాపులారిటీ కొట్టేశాడు. పుష్ప గెటప్, స్వాగ్, సాంగ్స్ అని ట్రెండ్ క్రియేట్ చేశాయనే చెప్పాలి. తగ్గేదే లే.. డైలాగ్ ఇప్పటికీ దేశమంతటా గల్లీ నుంచి ఢీల్లీ వరకు సెలబ్రెటీలు యూజ్ చేస్తున్నారు. అయితే పుష్ప క్యారెక్టర్‌కి ఓ టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఒక భుజం పైకెత్తి .. నడుస్తూ.. కనిపిస్తాడు పుష్ప.
20ఏళ్ల క్రితమే...:అయితే ఈ మేనరిజం ఓ స్టార్ హీరో నుంచి కాపీ కొట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే 20 ఏళ్ల క్రితమే ఓ స్టార్ హీరో ఇలాంటి మేనరిజం ఓ సినిమాలో వాడారు. ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా... ఆయనే దివంగత రియల్ స్టార్ శ్రీహరి. ఆయన నటించిన ఓ సినిమాలో ఇదే మాదిరిగా కనిపించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 'పృథ్వీ నారాయణ' అనే సినిమాలో శ్రీహరి నడుస్తూ వచ్చే స్టైల్, నిలబడే విధానం.. యాటిట్యూడ్ అన్నీ కూడా పుష్ప క్యారెక్టర్ లాగా అనిపిస్తున్నాయి.
కాపీ కొట్టిన అల్లు అర్జున్...:దీంతో శ్రీహరి మూవీ క్లిప్ చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. 2002లో వచ్చిన.. శ్రీహరి సినిమా క్లిప్‌ను పుష్పతో కంపార్ చేసి వైరల్ చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల కింద వచ్చిన ఈ చిత్రంలో శ్రీహరి డబుల్ రోల్ చేయగా.. అందులో ఒక రోల్‌కు పుష్ప వంటి యాటిట్యూడ్ ఉంది. పుష్ప మేనరిజమ్.. మా హీరో ఎప్పుడో చేశాడని శ్రీహరి అభిమానలు ఆ వీడియోను ట్రెండ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి పుష్ప గెటప్ కాపీనా అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు.
పుష్ప 2 కమింగ్...:ఇక పుష్ప మేనరిజాన్ని అల్లు అర్జున్ కాపీ కొట్టాడు అనడానికి లేదనుకోండి. ఆ క్యారెక్టర్ అనుకున్నదాన్ని బట్టి.. బాడీ లాంగ్వేజ్ ఫిక్స్ చేసుకున్నాడు సుక్కు. ఏది ఏమైనా ఆ గెటప్, మేనరిజం, యాటిట్యూడ్ నెక్ట్స్ లెవెల్. ప్రస్తుతం వీరు పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











