ఫస్ట్ లుక్: ఎన్టీఆర్‌లో ఏఎన్నార్.. తాతని దింపేశాడుగా!
Recommended Video

ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్ సరికొత్త ప్రచార విధానాన్ని అనుసరిస్తోంది. క్రిష్ దర్శత్వంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం పక్కా ప్రణాళికతో రూపుదిద్దుకుంటోంది. బాలకృష్ణ స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితంలోనే కీలక అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలయ్య ఎన్టీఆర్ గెటప్ లో ఒదిగిపోయాడు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే.

ఏఎన్నార్ ఫస్ట్ లుక్
ఈ చిత్రంలోని కీలక పాత్ర దారుల ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తూ సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు. నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన పాత్రలో నటిస్తున్న సుమంత్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సుమంత్ తన తాత ఏఎన్నార్ లా ఒదిగిపోయాడు. ఫస్ట్ లుక్ ఏఎన్నార్ ని గుర్తు చేసే విధంగా ఉంది.

మధ్య వయస్కుడిగా
సాధారణంగానే సుమంత్ లో ఏఎన్నార్ ముఖకవళికలు ఉంటాయి. దీనికి తోడు క్రిష్ క్రియేటివిటీ తోడు కావడంతో మధ్య వయస్కుడిగా ఉన్న సమయంలో ఏఎన్నార్ ఎలా ఉండేవారో సుమంత్ ని అలా తీర్చిదిద్దారు. కళ్ళజోడు, పెదవులపై చిరునవ్వు చూస్తుంటే వెంటనే ఏఎన్నార్ గుర్తుకు వస్తున్నారు.

అంచనాలు పెంచేలా
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాల్లో కీలక పాత్రల కోసం స్టార్ నటీనటుల్ని క్రిష్ ఎంపిక చేసుకున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. రానాని క్రిష్ పూర్తిగా చంద్రబాబులా మార్చేసిన సంగతి తెలిసిందే. యంగ్ ఏజ్ లో చంద్రబాబులా ఉన్నా రానా లుక్ ని ఇటీవల విడుదల చేశారు.
సంక్రాంతి టార్గెట్
దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని సంక్రాంతి టార్గెట్ గా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్ జీవితంలోని ఏ ఏ అంశాలు ఈ చిత్రంలో చూపిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాత్రలో మలయాళీ భామ మంజిమ మోహన్ నటించనుంది. హరికృష్ణ పాత్రలో నటించేందుకు కళ్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











