ఎన్టీఆర్ బయోపిక్‌లో సుమంత్ నటించిన తొలి సన్నివేశం.. ఏఎన్నార్ చివరి కారు!

ఎన్టీఆర్ బయోపిక్ లో చిత్రంలో నటించే ప్రతి నటుడికి ఈ చిత్రం ఓ మధుర జ్ఞాపకం అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో కనిపించబోయే పాత్రలన్నీ సాధారణమైనవి కావు. తన తండ్రి ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల పాత్రలకు స్టార్ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా చంద్రబాబు పాత్ర, ఏఎన్నార్ పాత్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నాడు. ఇటీవల ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. చంద్రబాబు గెటప్ లో రానా ఒదిగిపోయి కనిపించాడు. ఇక అక్కినేని నాగేశ్వర రావు పాత్రలలో హీరో సుమంత్ నటిస్తున్నాడు. సుమంత్ లుక్ కూడా ఏఎన్నార్ జయంతి సందర్భంగా విడుదలయింది. నిజంగా ఆ లుక్ లో కనిపిస్తున్నది ఏఎన్నారా లేక సుమంతా అని కన్ఫ్యూజ్ అయినట్లు చాలా మంది ప్రముఖులు ప్రశసంలు కురిపించిన సంగతి తెలిసిందే.

Sumanth reveals interesting details about NTR biopic movie

ఓ ఇంటర్వ్యూలో భాగంగా సుమంత్ మాట్లాడుతూ ఏఎన్నార్ పాత్ర గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ చిత్రంలో ఏఎన్నార్ గా తాను నటించిన తొలి సన్నివేశం గురించి తెలిపాడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సన్నివేశం ఈ చిత్రంలో తాను నటించిన ఫస్ట్ సీన్ అని సుమంత్ తెలిపాడు. తొలిరోజు షూటింగ్ కోసం తాత వాడిన చివరి కారులో వెళ్లానని సుమంత్ వివరించాడు. భారీ అంచనాలు నెలకొంటున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X