For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అసలే చలికాలం.. నేను హగ్గులతో ఆగను: ఆ హీరోయిన్‌పై సుమంత్ సంచలన వ్యాఖ్యలు

  |

  లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్రావు మనవడిగా సినీరంగ ప్రవేశం చేశాడు సుమంత్. మొదటి చిత్రం 'ప్రేమకథ'లో అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. ఆ తర్వాత ఎక్కువగా లవ్ స్టోరీలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక, ఇటీవల పూర్తిగా పంథాను మార్చి వైవిధ్యమైన చిత్రాలతో వస్తున్నాడు. ఇదిలాఉండగా, తాజాగా చిట్ చాట్ షోలో పాల్గొన్న సుమంత్.. ఓ హీరోయిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  సుమంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లు ఇవే

  సుమంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లు ఇవే

  సుమంత్ సినిమాల్లోకి ప్రవేశించి చాలా కాలం అవుతోంది. కానీ, అతడు భారీ స్థాయిలో హిట్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. అతడి సుదీర్ఘమైన కెరీర్‌లో ‘సత్యం' పెద్ద హిట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ‘గౌరీ' కూడా ఆ రేంజ్‌లో ఆడింది. వీటి తర్వాత అంతగా కలెక్షన్లు రాబట్టిన చిత్రాలు లేవు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం యాక్టర్‌గా అతడిని ఎక్కడికో తీసుకెళ్లాయని చెప్పొచ్చు.

  మొత్తం మార్చుకుని సక్సెస్‌ఫుల్‌గా

  మొత్తం మార్చుకుని సక్సెస్‌ఫుల్‌గా

  కెరీర్ ఆరంభంలో ఒకే తరహా సినిమాలు చేసుకుంటూ వచ్చిన సుమంత్.. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఇటీవలి కాలంలో తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. ఫలితంగా ‘గోదావరి', ‘గోల్కొండ హైస్కూల్', ‘మళ్లీ రావా' వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక, ఈ మధ్య వరుసగా వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని మంచి పేరును సంపాదించుకుంటున్నాడు.

  తాత పాత్రలో అదరగొట్టిన సుమంత్

  తాత పాత్రలో అదరగొట్టిన సుమంత్

  గత ఏడాది సుమంత్.. నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ బయోపిక్' రెండు భాగాల్లో నటించాడు. ఇందులో తన తాత అక్కినేని నాగేశ్వర్రావు పాత్రను పోషించిన అతడు.. అద్భుతమైన నటనతో పాటు ముఖ కవలికలతో మైమరపించాడు. ఏఎన్నారే దిగి వచ్చారా అన్నట్లుగా అతడు కనిపించి ఆశ్చర్యపరిచాడు. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు.

  మరో థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు

  మరో థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు

  సుమంత్ తాజా చిత్రం ‘కపటధారి'. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కవలుదారి'కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కించాడు. ఇందులో హీరోయిన్‌గా నందితా శ్వేత నటిస్తోంది. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై ధనుంజయ్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ఈ చిత్ర టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

  ఆ హీరోయిన్‌పై సంచలన వ్యాఖ్యలు

  బయట పెద్దగా కనిపించని సుమంత్.. సినిమా ప్రమోషన్ కోసం మాత్రం హల్‌చల్ చేస్తుంటాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు నటించిన ‘కపటధారి' మూవీ ప్రమోషన్ నిమిత్తం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తోన్న ‘తమాషా విత్ హర్షా' అనే కార్యక్రమానికి హీరోయిన్ నందితా శ్వేతతో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా సుమంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

  అసలే చలికాలం.. హగ్గులతో ఆగను

  అసలే చలికాలం.. హగ్గులతో ఆగను

  ఈ కార్యక్రమంలో యాంకర్ హర్షాతో కలిసి సందడి చేశాడు సుమంత్. అలాగే, ఆట పాటలతో అల్లరి చేశాడు. అదే సమయంలో ఓ సందర్భంలో యాంకర్ ‘కావాలంటే హీరోయిన్‌ గారిని హగ్ చేసుకోవచ్చు' అని హీరోతో అన్నాడు. దీనికి స్పందించిన సుమంత్.. ‘అసలే చలికాలం.. నేను హగ్గులతో ఆగలేను. తర్వాత ఏమైనా అయితే' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  English summary
  Yarlagadda Sumanth Kumar, known mononymously as Sumanth, is an Indian actor known predominantly for his work in Telugu cinema. The eldest grandson of the late Akkineni Nageswara Rao, he is also a partner in Annapurna Studios.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X