నందమూరి, అక్కినేని అనుబంధం.. పునాది ఎక్కడ పడిందో.. సుమంత్!

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుంలా ఈ వేడుకకు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు లాంటి ప్రముఖ నటులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆడియో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రంలో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కూడా ఒకటి.

ఎన్టీఆర్, ఏఎన్నార్ కలసి ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. గుండమ్మ కథ, మిస్సమ్మ, మాయాబజార్ లాంటి అద్భుత చిత్రాల్లో వీరిద్దరూ కలసి నటించడం విశేషం. వీరిద్దరి నటన అప్పట్లో వెండి తెరపై మ్యాజిక్ లా పనిచేసేది.ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఏఎన్నార్ పాత్రకోసం దర్శకుడు క్రిష్ హీరో సుమంత్ ని ఎంపిక చేసుకున్నాడు.

Sumanth Speech at NTR Biopic Audio Launch

సుమంత్ ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. బాలకృష్ణగారిని నేను ముద్దుగా మావయ్య అని పిలుస్తుంటాను అని సుమంత్ తెలిపాడు. అక్కినేని కుటుంబం తరుపున నందమూరి అభిమానులందరికి అభినందనలు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావించా. తాత గారి పాత్రని భాద్యతగా తీసుకున్నా అని సుమంత్ తెలిపాడు. నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఆ అనుబంధానికి పునాది ఎక్కడ పడింది అనేది ఈ చిత్రంలో తెలుస్తుంది అని సుమంత్ తెలిపాడు. నందమూరి అభిమానులంతా పండగ చేసుకునే చిత్రం ఇది అని సుమంత్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X