సందీప్ కిషన్ డేరింగ్ స్టెప్: మరో తెలుగు రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్లాన్

చిన్న చిన్న క్యారెక్టర్లతో యాక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోగా పరిచయం అయ్యాడు టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్. ఆరంభం నుంచీ వరుస పెట్టి సినిమాలను చేస్తున్న అతడికి హిట్లు మాత్రం రావడం లేదు. అప్పుడెప్పుడో 'వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్'తో మొదటి విజయాన్ని అందుకున్న సందీప్.. చాలా గ్యాప్ తర్వాత 'నిను వీడని నీడను నేనే'తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీని తర్వాత మళ్లీ వరుస దెబ్బలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇక, ఈ ఏడాది 'ఏ1 ఎక్స్‌ప్రెస్'తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇది మంచి టాక్ తెచ్చుకున్న కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు.

సినిమాల పరంగా అంతగా సక్సెస్ కాలేకపోతున్న సందీప్ కిషన్.. వ్యాపార రంగంలో మాత్రం దూసుకుపోతున్నాడు. ఇప్పటికే సెలూన్, రెస్టారెంట్ బిజినెస్‌లను ప్రారంభించిన అతడు.. వాటిని విజయవంతంగా నడుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తన బిజినెస్‌ను విస్థరించాలని నిర్ణయించుకున్నాడతను. ఇందులో భాగంగానే తన వ్యాపారాలను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా.. ఆంధ్రప్రదేశ్‌కు సైతం తీసుకెళ్లాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే తన సెలూన్, రెస్టారెంట్ బిజినెస్‌లను విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా దాదాపుగా పూర్తైందని సమాచారం.

Sundeep Kishan expanding Salon business in Andhrapradesh

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సందీప్ కిషన్ 'గల్లీ రౌడీ' అనే సినిమాలో నటించాడు. వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరొందిన జీ నాగేశ్వర్‌రెడ్డి దీన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా పూర్తైంది. ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, బాబీ సింహా కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో నేరుగా విడుదల కాబోతుందని ఓ న్యూస్ ఇటీవల బయటకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X