మూడు బ్రేకప్స్.. ఆరు నెలలు నరకం.. ఈ రోజుల్లో రిలేషన్ షిప్స్ అంతే ..

Sundeep Kishan: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎనర్జిటిక్ హీరోగా తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సందీప్ కిషన్. 'స్నేహగీతం'తో తెరంగేట్రం చేసిన ఈ యువ హీరో, తొలి చిత్రం తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. 'ప్రస్థానం' చిత్రంలో నటించిన నెగిటివ్ రోల్ అతనికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఆ పాత్రలో అతని పర్ఫార్మెన్స్‌ను ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసించారు. ఆ తరువాత 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో హీరో ఇమేజ్‌ను మరింత బలపర్చాడు. అయితే తదుపరి సరైన కథల ఎంపికలో కొంత వెనుకబడి, తన టాలెంట్‌కు తగిన అవకాశాలు పొందలేకపోయాడు. తాజాగా సందీప్ తన ప్రేమ,పెళ్లితో పాటు బ్రేకప్ లవ్ స్టోరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

ఇటీవల సందీప్ కిషన్ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంపై పెద్దగా మాట్లాడని సందీప్, ఈసారి మాత్రం తన ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటి సెన్సిటివ్ అంశాలపై ఓపెన్ అయ్యారు. "ఎప్పుడేమైనా డేటింగ్‌లో ఉన్నారా?" అని యంకర్ ప్రశ్నించగా, సందీప్ సరదాగా "నేను ప్రస్తుతం సింగిల్‌ని... గతంలో కూడా ఎవరితో రిలేషన్‌లో లేను.. ఇక భవిష్యత్తులో కూడా ఉండను" అని నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతటితో ఆగకుండా యాంకర్ "ఇది నిజమేనా?" అంటూ ప్రశ్నించగా... సందీప్ నిజం చెబుతూ, "అప్పట్లో చాలా ప్రచారం జరిగింది. కొన్ని విషయాలు దాచినా, దాగవు. కాఫీ షాప్‌లో ఆ రోజు ఎవరో నాతో కనిపించారు, థియేటర్‌కూ వెళ్లారు కాదా.. ఆ సమయంలో మీతో కలిసి ఫోటోలు దిగుదామనుకున్నాను' అని అన్నారు.

Sundeep Kishan Opens Up on Past Relationships Three Breakups Love Lessons in Viral Interview

సందీప్ కిషన్ వ్యక్తిగతంగా ఎప్పుడూ ఓపెన్ అయ్యే వ్యక్తి కాదు. కానీ ఈసారి మాత్రం తన లవ్ స్టోరీస్ ను బయటపెట్టారు. "నిజం చెప్పాలంటే, నేను నాలుగున్నర సంవత్సరాలు ఓ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నా. కానీ కొన్ని కారణాలతో విడిపోయాం. అంతే కాదు, మొత్తం మూడు బ్రేకప్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. ముగ్గురూ ఇండస్ట్రీ వాళ్లే" అని ఎమోషన్‌తో చెప్పారు. అంతట యాంకర్ "అంటే ఈ ముగ్గురు తెలుగు ఇండస్ట్రీకే చెందినవారా?" అని అడుగగా, "అవును.. మొదట లవ్ స్టోరీ నాలుగున్నర సంవత్సరాలు, సెకండ్ లవ్ స్టోరీ రెండున్నర సంవత్సరాలు, మూడోది కూడా రెండున్నర సంవత్సరాలు. అంతే చెప్పగలను" అని సింపుల్‌గా బదులిచ్చారు.

తన బ్రేకప్ రిలేషన్‌ షిప్ గురించి సందీప్ కిషన్ మాట్లాడుతూ.."నేను రిలేషన్‌లో ఉంటే పప్పీలా మారిపోతా. వాళ్లు చెన్నైలో ఉన్నా, నాకు ఒక రోజు టైమ్ దొరికినా, వెంటనే వెళ్లిపోతా. వాళ్లు హైదరాబాద్ ఉన్నా, నేను చెన్నైలో ఉన్నా, ఫ్లైట్ ఎక్కేయడానికి వెనకాడను. నాకు ఇండస్ట్రీ, సినిమాలు తప్ప ఇంకేం తెలియదు. ప్రేమలో పడితే వాళ్లకే డైవర్ట్ అవుతా.. కొంచెం సినిమాలపైనా ఫోకస్ తగ్గింది" అని కాస్త ఎమోషనల్ అయ్యారు.

బ్రేకప్స్ నుంచి ఎలా బయటపడ్డారని అడగగా.. "ఆ ఆరు నెలలు నిజంగా నరకం. మనసు ఛిన్నాభిన్నం అవుతుంది. కానీ, నా జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంది. ఆమె నాకు ప్రతి విషయంలో గైడెన్స్ ఇస్తుంది. బాధ పడాల్సినప్పుడు పడాలి. అప్పుడు మాత్రమే మనం బయట పడగలం" అని చెప్పారు. ముగ్గురు అమ్మాయిలతో ఎందుకు విడిపోయారనే ప్రశ్నించగా.. "ప్రత్యేకమైన కారణాలు ఏమీ ఉండవు. కొన్ని పరిస్థితులు అలానే ఉంటాయి. ఇప్పుడు ఏజ్ 30 దాటాకే చాలా విషయాలు అర్థమవుతాయి" అని చెప్పారు.

"బాధపడాల్సిన సమయంలో బాధపడాలి. తర్వాత ఆ బాధ నుంచి బయటపడు. కొత్తగా ఆలోచించు, కొత్తగా బ్రతుకు. ఇదే నా మోటివేషన్" అని సందీప్ తనదైన స్టైల్ లో చెప్పారు. పర్సనల్‌గా ఎంతో బాధను చూసినా, పబ్లిక్‌గా ఎన్నడూ అది బయట పెట్టని సందీప్, ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గతంలో సందీప్ కిష‌న్, హీరోయిన్ రెజీనా కసాండ్రాతో డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన "ముగ్గురూ ఇండస్ట్రీ వాళ్లే" అని చెప్పడంతో, సోషల్ మీడియాలో "అంటే ఆ లిస్ట్‌లో రెజీనా కూడా ఉన్నదా?", "సందీప్-రెజీనా లకు బ్రేకప్‌ అయ్యిందా?" అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X