ఎవ్వరినీ మోసం చేయలేదు.. అయినా ఆపాలని చూశారు.. సందీప్ కిషన్

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకుడు. అన్యా సింగ్ హీరోయిన్. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కుతోంది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలుగా వ్యవరించారు. జులై 12 వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సందర్బంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

ఈ వేదికపై హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ''వర్షాలు వచ్చినా, సెమీ ఫైనల్ మ్యాచ్ ఉన్నా మీరంతా ఈ వేడుకకు హాజరైనందుకు థాంక్స్ చెబుతున్నా. ధీమాగా చెబుతున్నా.. నిను వీడని నీడను నేనే సినిమా పక్కా హిట్ అవుతుంది. యూనిట్ అందరం కష్టపడి పనిచేశాం. నా కెరీర్ లోనే ఇది సక్సెస్ ఫుల్ మూవీ అవుతుంది. రోజూ 150 మందికి పైగా భోజనం పెట్టాం. ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా మోసం చేయలేదు. ఫాక్ట్ ఏంటంటే శుక్రవారం వరకు ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అనే టెన్షన్ ఉండేది. కానీ శివ, సీతారాం ఈ ఇద్దరే సినిమాను ఇక్కడి దాకా తీసుకొచ్చారు.

Sundeep Kishans Speech at Ninu Veedani Needanu Nene Pre Release event

ఒకడు సినిమా తీద్దామంటే చాలు.. దాన్ని ఆపడానికి సంబంధంలేని వాళ్లంతా పూనుకుంటారు. కానీ అందరి కన్నా, అన్నిటికన్నా సినిమానే గొప్పది. ఆ సినిమాను ఆ సినిమానే కాపాడుకుంటూ వస్తుంది.. అదే 'నిను వీడను నీడను నేనే' సినిమా. ఎన్నో అడ్డాకుల వచ్చాయి.. కానీ వాటన్నింటినీ అధిగమిస్తూ ఈ రోజు సినిమా విడుదల చేసేందుకు రెడీ అయ్యాం. రాత్రింబవళ్ళు పని చేసి ఈ సినిమాను రూపొందించాం. జులై 12 న ఈ సినిమాతో మీ ముందుకొస్తున్నాం. అందరూ చూడండి. సినిమా చాలా చాలా బాగుంది అనే మాట మీ నోటెంట వస్తుందని నమ్ముతున్నా'' అని అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X