సైరాలో సందీప్ కిషన్ అద్భుతంగా నటించాడు.. నెటిజన్ల కామెంట్ .. వైరల్ అవుతున్న వీడియో
ఈ మధ్య సినిమాపై పబ్లిక్ టాక్ తెలుసుకునేందుకు మీడియా థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే వీటిని అదునుగా చేసుకుని.. కొంతమంది ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. సినిమాకు సంబంధం లేకుండా ఏవేవో చెబుతూ కొందరు ఫేమస్ కాగా.. మరి కొంతమంది జనాల చూపులను ఆకర్షించేందుకు సినిమాపై రెచ్చిపోయి కామెంట్లు చేస్తుంటారు.
అలాంటి ఓ సంఘటనే ఓ థియేటర్ వద్ద జరిగింది. అసలే రెండు తెలుగు రాష్ట్రాల్లో.. సైరా ఫీవర్ నడుస్తూ ఉంటే.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. చిరంజీవి తరువాత మీకు ఏ పాత్ర నచ్చిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సైరాలో చిరు అద్బుతంగా నటించాడు.. ఆయన తరువాత అమితాబ్ బచ్చన్ గారు బాగా చేశారు.. సందీప్ కిషన్ కూడా బాగా చేశాడంటూ చెప్పుకొచ్చాడ. అయితే సైరాలో సందీప్ కిషన్ ఎక్కడినుంచి వచ్చాడని నెటిజన్లు సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతూ.. చివరకు సందీప్ కిషన్ వద్దకు చేరుకుంది. ఈ వీడియోకు సందీప్ కిషన్ తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు. అయితే ఈ వీడియోను ఎడిట్ చేసిన విధానం, వీడియోలో ఉన్న కంటెంట్ హైలెట్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మీరు నిజంగానే సైరా అద్భుతమైన పాత్రను పోషించారని కొందరు.. నరాలు తెగిపోయేలా నటించారని మరికొందరు.. సినిమాను రెండు సార్లు చూశాను నువ్వెక్కడా కనబడలేదే? అంటూ అమాయకంగా మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. అయితే సుదీప్ కిచ్చా అనబోయి సందీప్ కిషన్ అని అన్నట్లు ఉన్నాడంటూ ఇంకొంత మంది కామెంట్లు పెడుతున్నారు.

దూసుకుపోతున్న సైరా..
లాంగ్ వీకెండ్, దసరా సెలవులు ఇలా అన్నింటిని సైరా బాగానే వాడుకుంటోంది. వీటికి తగ్గట్లు సైరాపై అద్భుతమైన టాక్ రావడంతో వసూళ్లలో తిరుగులేకుండా పోతోంది. తొలిరోజే 85 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఔరా అనిపించింది. మూడో రోజుల్లో దాదాపు 140 కోట్ల గ్రాస్ను రాబట్టి వంద కోట్ల షేర్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విధంగా సైరా సత్తా చాటితే.. దసరా సెలవులు పూర్తయ్యే నాటికి రికార్డుల మోత మోగుతుంది.


Click it and Unblock the Notifications











