నాలుగు బ్రేకప్‌లు.. రెజీనా కసాండ్రాతో ప్రేమాయణం.. షాకింగ్ విషయాలు చెప్పిన సందీప్ కిషన్!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో స్నేహగీతం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన ఈయన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లోనూ మెరుస్తున్నాడు. అయితే తాజాగా ఈయన లవ్ స్టోరీ గురించి చెప్పారు. ముఖ్యంగా హీరోయన్ రెజీనా కసాండ్రాతో తనకు ఉన్న బంధం గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హీరో సందీప్ కిషన్ తాజాగా ఊరు పేర భైరవ కోన అనే సినిమా చేశాడు. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్ సరసన ఈ సినిమాలో వర్ష బొల్లమ, కావ్య థాపర్ లు హీరోయిన్లుగా చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.

సినిమా విడుదలకు మరో ఐదు రోజులే సమయం ఉండడంతో.. హీరో సందీప్ కిషన్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే చాలా షాకింగ్ విషయాలు చెబుతూ అందరినీ షాక్ కు గురి చేస్తున్నారు. ముఖ్యంగా తన సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయాలి అనుకున్నప్పటికీ.. అస్సలే కుదరలేదని.. తనతో పాటు మూవీ టీం అంతా తీవ్రంగా కష్టపడినా విడుదల వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
సినిమాలు చేయడం వరకే మన పని అని.. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది వంటివి అస్సలే మన చేతిలో ఉండవు అంటూ సందీప్ కిషన్ వివరించారు. అలాగే తన ప్రేమ గురించి చెప్పి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెబుతూ అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు. తనకు చాలానే ప్రేమాయణాలు ఉన్నాయని.. ఓ ముగ్గురు నలుగురు అమ్మాయిలను ప్రేమించానని అన్నారు. నాలుగేళ్లు, మూడేళ్లు, రెండేళ్లు, రెండున్నరేళ్లు.. ఇలా ఇంతింత కాలం ఒక్కో అమ్మాయితో డిఫరెంట్ టైమ్స్ లో రిలేషన్ లో ఉన్నానని వెల్లడించారు.

ఆ తర్వాత యాంకర్.. సందీప్ కిషన్ రెజీనా కసాండ్రాను ఉద్దేషిస్తూ చేసిన ఓ ట్వీట్ ను చూపించారు. హ్యాపీ బర్త్ డే పాపా.. లవ్ యూ అండ్ విషింగ్ యూ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.. అంటూ రెజీనాతో ఉన్న ఫొటోను సందీప్ షేర్ చేయగా యాంకర్ చూపెట్టాడు. దీనికి స్పందించిన సందీప్ కిషన్.. రెజీనా తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని.. తన లవ్ స్టోరీస్ అన్నింటితో పాటు బ్రేకప్ ల గురించి తెలుసని.. ఆ సమయంలో తను తన పక్కనే ఉందని వివరించాడు. పదిహేనేళ్లుగా స్నేహం ఉంటే ఈమాత్రం క్లోజ్ నెస్ ఉండడంలో ఎలాంటి తప్పు లేదని అన్నాడు.


Click it and Unblock the Notifications











