లాక్‌డౌన్‌లో హీరో వర్కౌట్లు.. 12కేజీలు తగ్గి సిక్స్ ప్యాక్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ ప్రస్థానం సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. అందులో విలన్ పాత్రను అద్భుతంగా పోషించి అందర్నీ మెప్పించాడు. ఆపై హీరోగానూ నిలదొక్కుకున్నాడు. అయితే మధ్యలో కొన్ని అపజయాలు పలకరించాయి. కొన్నాళ్లు విజయమనేది దరి చేరలేదు. కానీ చివరగా వచ్చి రెండు చిత్రాలు సందీప్ కిషన్‌ను నిలబెట్టాయి. అయితే అనూహ్యంగా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని సందీప్ కిషన్ బాగానే వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.
లాక్ డౌన్ కారణంగా సెలెబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీతో సరదాగా కాలాన్ని గడిపితే.. ఇంకొందరు తమ ప్రాజెక్ట్‌లు, తమ పాత్రలకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకున్నారు. ఆ కోవలోకి చెందిన వాడే సందీప్ కిషన్. ఈ లాక్ డౌన్‌లో విపరీతంగా వర్కౌట్లు చేసి.. బొద్దుగా ఉన్నవాడు కాస్తా.. సిక్స్ ప్యాక్‌లో దర్శనమిచ్చాడు.

మూడు నెలల్లో దాదాపు 12 కిలోలు తగ్గి.. ఫిట్‌గా తయారయ్యాడు. సందీప్ ప్రస్తుతం క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఏ1 ఎక్స్‌ప్రెస్ కోసం సందీప్ సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సందీప్ కిషన్ లుక్ అదిరిపోయేలా ఉంది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈ చిత్రం నుంచి విడుదలైన సింగిల్ కింగులమ్ అనే పాట ఓ రేంజ్‌లో క్లిక్కయింది.


Click it and Unblock the Notifications











