‘నాపై 50 కోట్లు పెట్టడానికి భయం.. ఆ హీరోపై 500 కోట్లు.. సక్సెస్‌ లేకపోతే ఎవడు పట్టించుకోడు..’

బాలీవుడ్‌లో మూడు దశాబ్దాల కాలంగా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలరిస్తున్న సునీల్ శెట్టి సెకండ్ ఇన్నింగ్స్‌ను గట్టిగానే ప్రారంభించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తన నటనతో ప్రయోగాలు చేయడం అలవాటుగా మారింది. అయితే ప్రస్తుతం రూ.500 కోట్ల ప్రాజెక్టులో భాగం కావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

బ్రాలో అందాలను ఆరబోసిన హీనా పంచల్.. బికినీలో అదరగొట్టిన యువ హీరోయిన్

 బాలీవుడ్‌లో కండలవీరుడిగా

బాలీవుడ్‌లో కండలవీరుడిగా

90వ దశకంలో కండలవీరుడుగా సునీల్ శెట్టి సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. బలవాన్ చిత్రంతో 1992లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన యాక్షన్ హీరోగా మారిపోయాడు. మెహ్రా, బోర్డర్, కాంటే, సపూత్, హెరాపేరి, దడ్కన్, మై హూనా లాంటి చిత్రాల్లో నటించారు.

 మోసగాళ్లుతో టాలీవుడ్‌లోకి

మోసగాళ్లుతో టాలీవుడ్‌లోకి

సునీల్ శెట్టి ఇటీవలే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్‌తో కలిసి మోసగాళ్లు చిత్రంలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సునీల్ శెట్టి విభిన్నమైన పాత్రలో కనిపించారు. సునీల్ శెట్టి నటనకు మంచి ప్రశంసలు కూడా లభించాయి.

యాక్షన్ చిత్రాలతో ప్రయోగాలు

యాక్షన్ చిత్రాలతో ప్రయోగాలు

అయితే తాజాగా బాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలు జోరందుకోవడంపై సునీల్ శెట్టి స్పందించారు. ఆయుష్మాన్ ఖురానా, టైగర్ ష్రాఫ్ లాంటి వాళ్లు యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ కెరీర్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి హీరోలందరికీ హాట్యాఫ్ చెప్పాల్సిందే. మా కాలంలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ అలాంటి ప్రయోగాలు చేశారు. ఆ స్పూర్తే ఇప్పటి హీరోల్లో కనిపిస్తున్నది అంటూ సునీల్ శెట్టి పేర్కొన్నారు.

అందుకే పరాజయం పాలయ్యాను

అందుకే పరాజయం పాలయ్యాను

యాక్షన్ హీరోగా నేను కూడా అనేక ప్రయోగాలు చేశాను. కానీ బాక్సాఫీస్ వద్ద అంతా ఆకట్టుకోలేకపోయాయి. సరైన సబ్జెక్ట్స్ ఎంచుకోకపోవడం, మంచి చిత్రాలను సరిగా మార్కెట్ చేసుకోలేకపోవడం వల్లే పరాజయాలను చవి చూశాను. అయినా నా కెరీర్ గురించి నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. నేను కొన్ని తప్పులు చేసినప్పటకికీ.. నా జర్నీ అద్భుతంగా కొనసాగిందనే చెప్పడానికి హ్యాపీగా ఉన్నాను. నా కొడుకు కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకొంటాను అని సునీల్ శెట్టి అన్నారు.

నాపై 50 కోట్లు పెట్టడానికి

నాపై 50 కోట్లు పెట్టడానికి

అయితే బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ మన గురించి మాట్లాడుతుందనేది నేను బలంగా నమ్ముతాను. నాపై 50 కోట్ల రూపాయలు పెట్టడానికి కూడా రెడీగా లేరు. కానీ అక్షయ్ కుమార్‌పైన 500 కోట్ల రూపాయలు పెట్డడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. దానినే సక్సెస్ మంత్ర అంటారు. సక్సెస్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు అని సునీల్ శెట్టి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X