టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రీమేక్.. హీరోగా దిగ్గజ నటుడి కొడుకు!
చిన్న చిత్రంగా విడుదలైన ఆర్ఎక్స్ 100 చిత్రం ఘనవిజయం సాధించి నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం సాధించిన విజయంతో రీమేక్ హక్కులపై హిందీ నిర్మాతల దృష్టి పడింది. బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ నడియాద్ వాలా ఆర్ఎక్స్ 100 రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నారు.
ఈ చిత్ర రీమేక్ లో దిగ్గజ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి హీరోగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సునీల్ శెట్టి కుమార్తె అథియా శెట్టి 2015 లో సల్మాన్ ఖాన్ నిర్మించిన హీరో చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే.

తెలుగులో ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంతంగా నటించారు. పాయల్ రాజ్ పుత్ బోల్డ్ పెర్ఫామెన్స్, కార్తికేయ ఎమోషనల్ నటన ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications











