అరవింద సమేతలో సునీల్ పంచ్ డైలాగ్స్!
అరవింద సమేత చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న తొలి చిత్రం ఇది. పవర్ ఫుల్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో త్రివిక్రమ్ అరవింద సమేత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ లో ఎన్టీఆర్ అదరగొట్టాడు. అది శాంపిల్ మాత్రమే. రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్ లో చెబుతున్న డైలాగ్స్ కేకే పట్టిస్తున్నాయి. అంత మాత్రాన ఈ చిత్రం మొత్తం సీరియస్ గా సాగదు.

త్రివిక్రమ్ మార్క్ కామెడీ కూడా ఈ చిత్రంలో హైలైట్ గా నిలుస్తుందట. చాలా కలం తరువాత ఈ చిత్రంలో సునీల్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ తో సునీల్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది సమాచారం. ఎన్టీఆర్, సునీల్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











