సునీల్‌కు మరో క్రేజీ అఫర్.. అరవింద సమేత తర్వాత!
కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సునీల్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. కొంత కాలం పాటు హీరోగా సునీల్ కు మంచి విజయాలు దక్కాయి. ఆ తర్వాతే సునీల్ కు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఎంత ప్రయత్నించినా సునీల్ కు సరైన విజయం దక్కలేదు. రోజు రోజుకు సునీల్ మార్కెట్ పడిపోతూ వచ్చింది. దీనితో సునీల్ డైలమాలో పడ్డాడు.
హీరోగా అవకాశాలు తగ్గడంతో మళ్ళి కామెడీ రోల్స్ చేయాలనీ నిరించుకున్నాడు. ఇటీవల అరవింద సమేత చిత్రంలో సునీల్ కు మంచి అవకాశం లభించింది. దాదాపుగా సినిమా మొత్తం హీరోతో ట్రావెల్ అయ్యే పాత్ర అది. పూర్తిస్థాయిలో కామెడీ పాత్ర కాకున్నా అరవింద సమేతలో సునీల్ పాత్రకు కాస్త ఫన్నీ టచ్ ఉంది. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో కూడా సునీల్ ఓ పాత్రలో నటించాడు. తాజాగా సునీల్ కు మరో క్రేజీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది.

సంపత్ నంది, గోపీచంద్ కాంబోలో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో సంపత్ నంది అదిరిపోయే కామెడీ సీన్స్ రెడీ చేశాడట. ఆ సన్నివేశాలు ఎక్కువగా గోపీచంద్, సునీల్ మధ్యే ఉంటాయని అంటున్నారు. దీనితో సునీల్ ఇంకాస్త ఇంకాస్త కామెడీ డోస్ పెంచే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. కమెడియన్ గా సునీల్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతాడో లేదో భవిష్యత్తు చిత్రాల ద్వారా తేలనుంది.


Click it and Unblock the Notifications











