థియేటర్‌లో సామాన్యుడిలా సూపర్ స్టార్ రజని!
సూపర్ స్టార్ రజనీకాంత్ నిడారంబరమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతారు. చాలా సందర్భాల్లో రజనీకాంత్ సింప్లిసిటీ బయట పడింది. రజని నటించిన 2.0 చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. రజనీకాంత్ 2.0 చిత్రాన్ని చూసేందుకు చెన్నై లోని సత్యం థియేటర్ కు సామాన్యుడిలా కుటుంబంతో కలసి వచ్చారు. రజని తన సతీమణి లత, మానమలతో కలసి 2.0 చిత్రాన్ని వీక్షించారు.
రజనీకాంత్ సింప్లిసిటీకి అభిమానులు మరోమారు ఫిదా అవుతున్నారు. 2.0 చిత్రం రోబో చిత్రాన్ని సీక్వెల్ గా వచ్చింది. దర్శకుడు శంకర్ ఈ విజువల్ వండర్ ని 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. 2.0 వసూళ్లు తమిళనాట కాస్త నిరాశపరిచేలా ఉన్నా.. యూఎస్, నార్త్ ఇండియాలో అదిరిపోతున్నాయి. హీరోయిన్ అమీ జాక్సన్ లేడి రోబోగా నటించింది.

2.0 చిత్రం చాలా రోజులుగా వాయిదా పడ్డప్పటికీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తి చూపారు. ప్రతినాయకుడిగా అక్షయ్ కుమార్ పోషించిన పక్షిరాజు పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా రజని త్వరలోనే పేట చిత్రంతో రజని రాబోతున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











