ఆ ఒక్క మాట అనగానే స్టూడియో మొత్తం పరిగెత్తించిన మహేష్ బాబు.. ఎవరికి తెలియని సీక్రెట్

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సినిమా చరిత్రలో ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఎన్టీఆర్ నాగేశ్వరరావు తర్వాత మళ్లీ తెలుగు పరిశ్రమలో మర్చిపోలేని హీరోలలో ఒకరిగా క్రేజ్ అందుకున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా ఆయన మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన తనయుడు మహేష్ బాబు తండ్రికి తగ్గట్టుగానే సూపర్ స్టార్ హోదా ను కొనసాగిస్తున్నారు. అయితే మహేష్ బాబు గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ విషయాన్ని కూడా కృష్ణ గారు ఇటీవల బయటపెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ హీరోగా..

సూపర్ స్టార్ హీరోగా..

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఎలాంటి గుర్తింపును అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. జేమ్స్ బాండ్ అల్లూరి సీతారామరాజు సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పటికి కూడా అల్లూరి సీతారామరాజు పాత్ర అంటే సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకు రాకుండా ఉండరు. ఆయన ఆ పాత్రలో కనిపించి ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఈసారి కూడా..

ఈసారి కూడా..

ఇక సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆయన నట వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే కృష్ణ గారి అభిమానులు కూడా మహేష్ బాబును అదే తరహాలో అభిమానిస్తున్నారు అని కూడా చెప్పవచ్చు. ఇక మహేష్ బాబు గురించి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి సారి కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని చెబుతూ ఉంటారు. ఈసారి కూడా మరో కొత్త విషయాన్ని చెప్పారు.

కూతురితో ఇంటర్వ్యూ

కూతురితో ఇంటర్వ్యూ

అయితే సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కూతురు మంజుల ఘట్టమనేని తో ఒక కలిసి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రశ్నపై కూడా మంజుల ఘట్టమనేని సమాధానాలను అడిగి తెలుసుకున్నారు. మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం యాదృచ్చికంగా జరిగిందా లేక పోతే ముందుగా అనుకుని ఎంట్రీ ఇవ్వడం జరిగిందా అని మంజుల తన తండ్రిని అడిగారు.

స్టూడియో మొత్తం పరిగెత్తించిన మహేష్

స్టూడియో మొత్తం పరిగెత్తించిన మహేష్

ఇక మహేష్ బాబు ఎంట్రీ పై మొదటిసారి స్పందించిన సూపర్ స్టార్ కృష్ణ ఒక రోజు షూటింగ్ చూస్తాను అని మహేష్ స్టూడియో కు వచ్చాడు అని, అయితే ఆరోజు సినిమాలో నటిస్తావా అని నేను అడిగితే మహేష్ బాబు నేను నటించలేను అన్నాడట. అంతే కాకుండా అతన్ని ఒప్పించాలి అనుకుంటే పద్మాలయ స్టూడియో చుట్టూ పరిగెత్తించాడు అని నటన అంటే అంతగా భయపడిపోయే వాడు అని కృష్ణ తెలియజేశారు.

Recommended Video

Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
మహేష్ బాబుకు ముందే చెప్పా..

మహేష్ బాబుకు ముందే చెప్పా..

ఇక ఇప్పుడు మాత్రం మహేష్ బాబు చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఉండడం విశేషమే అని చెప్పవచ్చు. ఇక మహేష్ బాబుతో కలిసి తాను పోకిరి సినిమా దూకుడు సినిమా కలిసి చూశాను అని ఆ రెండు కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి అని ఆ విషయం కూడా మహేష్ బాబు కు ముందే చెప్పినట్లుగా కృష్ణ వివరణ ఇచ్చారు. మంజుల ఘట్టమనేని యూట్యూబ్ ఛానల్ లో అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీన కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఫుల్ ఇంటర్వ్యూ వీడియోని విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X