Mahesh Babu: సెట్స్‌లోనే బుగ్గలు గిల్లిన మహేష్ బాబు... వైరల్‌గా మారిన రొమాంటిక్ వీడియో!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ఎంత అందంగా ఉంటారో ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఇక తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే మహేష్ బాబు వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆయన మూవీ సెట్స్ లో ఓ అసిస్టెంట్ బుగ్గలు గిల్లుతున్న వీడియో ఇప్పుడు నెట్టింటను షేక్ చేస్తుంది. మహేశ్ బాబులో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ వీడియో ఏంటి.. అనేది ఈ స్టోరీలో చూసేద్దాం.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తండ్రిని అనుసరిస్తూ ఎన్నో చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు చిత్రంతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే ఎవరు ఈ రాజకుమారుడు.. అనుకునేలా చేశాడు మహేష్ బాబు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, తన అందంతో ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు.

ఇక నిజంగా రాజకుమారుడు అంటే ఇలాగే ఉంటాడా అన్నట్లు మహేష్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఆతర్వాత ఎన్నో చిత్రాలు చేశాడు. ఇక నమ్రతతో ప్రేమలో పడిన మహేష్ పెళ్లి చేసుకుని అమ్మాయిలకు షాక్ ఇచ్చాడు. ఇవన్నీ తెలిసిన విషయమే అయినప్పటికీ మహేష్ కెరియర్లో అమ్మాయిలతో కానీ, అబ్బాయిలతో కానీ క్లోజ్ గా ఉన్నట్లు ఎప్పుడు కనిపించలేదు. బాబు ఇంట్రో వర్ట్ అయినప్పటికీ.. పంచ్ టైమింగ్ మాత్రం అల్టిమేట్ గా ఉంటుంది.

ఆ విషయం పక్కన పెడితే.. మహేష్ బాబుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. బాబు సెట్స్ లో అసిస్టెంట్ బుగ్గలు గిల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు బాబు ఏంటి.. ఇలా బుగ్గలు గిల్లడం ఏంటని అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఆ అసిస్టెంట్ లేడీ అనుకుంటే పొరపాటే.. అతను ఓ మూవీకి అసిస్టెంట్. ఓ సీన్ విషయంలో బాబు ఆ వ్యక్తి బుగ్గలు పట్టుకని గిల్లుతుంటాడు.
ఇక ఆ వీడియో చూసిన ఫ్యాన్స్... ఏంటి మహేష్ బాబు అసిస్టెంట్ తో రొమాన్స్ చేస్తున్నాడా.. బాబులో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆ వీడియో ఎప్పటిదో అయినా ప్రస్తుతం మహేష్ కు సంబంధించినవి అన్ని వైరల్ గా మారాయి. దానికి కారణం రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేయడమే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ మూవీగా రానున్న ఈ చిత్రం ఇటీవల టీమ్ ను కన్ఫార్మ్ చేసుకుంది.
ఇక సెట్స్ పైకి త్వరలోనే వెళ్లనుందని తెలుస్తోంది. ఇకఈ మూవీలో మహేష్ బాబు కొత్త క్యారెక్టర్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక దాని కోసం శిక్షణ కూడా తీసుకుంటున్నడని సమాచారం. మహేష్ బాబు రాజమౌళి మూవీ 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ నటులు నటిస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











