ఏకంగా బిల్ గేట్స్ తో మహేష్ బాబు ముచ్చట్లు.. భార్యతో కలిసి అలా.. ఫొటో వైరల్
సర్కారు వారి పాట సినిమా అనంతరం మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా విహార యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరికి సంబంధించిన ఫోటోలు నిత్యం సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక రీసెంట్ గా మహేష్ బాబు ఏకంగా ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులలో ఒకరైన బిల్ గేట్స్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ గా మారింది. ఇక వీరు మైక్రోసాఫ్ట్ అధినేతను ఎక్కడ కలుసుకున్నారు? ఎలా కలుసుకున్నారు అనే వివరాల్లోకి వెళితే..

హాలిడే స్పాట్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తవగానే ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో ఏదైనా హాలిడేస్ స్పాట్ కు వెళుతూ ఉండడం ఆనవాయితీ గా వస్తోంది. కొడుకు కూతురు తో అలాగే భార్య తో మహేష్ బాబు ఎంత హ్యాపీగా విహార యాత్రలు చేస్తూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు కూతురు సితార కూడా వారి ట్రిప్స్ సంబంధించిన ఎన్నో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.

న్యూయార్క్ నగరంలో..
ఇక మహేష్ బాబు ఇటీవల అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే ప్రత్యేకంగా కొన్ని ప్రధాన నగరాలను చుట్టేస్తున్న మహేష్ బాబు ప్రత్యేకంగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నాడు. ఇక న్యూయార్క్ నగరంలో మహేష్ బాబు ప్రత్యేకంగా రోడ్డుపై తిరుగుతున్న కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల నమ్రత తన కూతురితో దిగిన ఒక ఫోటోను కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకోండి.

బిల్ గేట్స్ తో ఫొటో
అయితే మహేష్ బాబు నమ్రత రీసెంట్ గా ఒక ప్రముఖ వ్యక్తిని కలవడం విశేషం. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ సృష్టికర్త బిల్ గేట్స్ తో ప్రత్యేకంగా వారు కలిసి ముచ్చటించారట. అంతేకాకుండా ఆయనతో దిగిన ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మహేష్ బాబు నమ్రత సింపుల్గా బిల్ గేట్స్ పక్కన ఇరువైపులా నిలబడి ఫోటోకు స్టిల్ ఇచ్చారు.
Recommended Video


నమ్రత ద్వారా ఇలా..
మహేష్ బాబు కు ఎంత స్టార్ హోదా ఉన్నాకూడా ఎక్కువగా నమ్రత శిరోద్కర్ కు మాత్రమే చాలా మంది సినీ ప్రముఖులతో అలాగే వ్యాపారవేత్తల తో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ఒక విధంగా మహేష్ బాబు ప్రముఖ కంపెనీల తో ప్రత్యేకంగా యాడ్స్ చేయడానికి కారణం కూడా అదే. రీసెంట్ గా ఆమె ద్వారానే మహేష్ బాబు బిల్ గేట్స్ తో కలిసి ఫోటో దిగినట్లుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్టును త్రివిక్రమ్ సినిమాతో మొదలు పెట్టబోతున్నాడు. అలాగే రాజమౌళితో కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











