వరల్డ్ టాప్ 5లో ఒకడిగా మహేష్.. ఉత్కంఠ పెంచేలా మహర్షి!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు పాత్రని మూడు కోణాల్లో దర్శకుడు భిన్నంగా ఆవిష్కరిస్తునట్లు తెలుస్తోంది. వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే కార్పొరేట్ సంస్థ అధినేతగా మహేష్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నాడట.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన 5 మందిలో మహేష్ ఒకడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా పాత్ర మహేష్ బాబుకు చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పటికే శ్రీమంతుడు చిత్రాల్లో మహేష్ కోటీశ్వరుడి కుమారుడిగా నటించిన సంగతి తెలిసిందే. ధనవంతుడిగా మహేష్ నటన ఈ చిత్రానికే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

మహేష్ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అశ్విని దత్, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఊపిరి చిత్రం తరువాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం విశేషం. వంశీ పైడిపల్లి చిత్రాల్లో బలమైన కథ ఉంటుంది. మహర్షి చిత్రానికి కూడా అలాంటి కథనే సిద్ధం చేసి ఉంటాడని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











