బుర్జ్ ఖలీఫా పై నుంచి మహేష్ బాబు బైక్ స్టంట్.. హై వోల్టేజ్ సీన్ మామూలుగా లేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు చేయడమే కాకుండా మరోవైపు వరుసగా ప్రయివేట్ యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇక ఇంతకుముందు తమ్స్ అప్ యాడ్ లో నటించిన మహేష్ రీసెంట్ గా కొత్త బ్రాండ్ మౌంటెన్ డ్యూకి షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ బ్రాండ్ కు సంబంధించిన యాడ్ లో మహేష్ ఒక గ్రాఫిక్స్ స్టంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎలాంటి సినిమా చేసినా..

ఎలాంటి సినిమా చేసినా..

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ ప్రస్తుతం నేషనల్ వైడ్ గా గట్టిగానే పెరుగుతోంది. కేవలం సినిమాలతోనే కాకుండా మహేష్ యాడ్స్ తో కూడా భారీ స్థాయిలో తన ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం ఎలాంటి సినిమా చేసినా కూడా మార్కెట్ లో ఈజీగా 150కోట్లకు పైగా బిజినెస్ చేస్తోంది. కొన్నిసార్లు అంతకుమించి అనేలా విజయాలను కూడా అందుకుంటున్నాయి.

 రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా..

రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా..

ఇక రానున్న రోజుల్లో మహేష్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సర్కారు వారి పాట పై ప్రస్తుతం అంచనాలు గట్టిగానే ఉన్నాయి. గీతగోవిందం దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక మొదటిసారి మహానటి కీర్తి సురేష్ మహేష్ బాబుతో సినిమా చేస్తోంది. ఈ సరికొత్త కాంబినేషన్ ను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బుర్జ్ ఖలీఫా నుంచి బైక్ స్టంట్

బుర్జ్ ఖలీఫా నుంచి బైక్ స్టంట్

ఇక మహేష్ బాబు రీసెంట్ గా పెప్సీ కంపెనీకి చెందిన సాఫ్ట్ డ్రింక్ అయినటువంటి మౌంటెన్ డ్యూకి ఒక ప్రమోషన్ యాడ్ చేశాడు. అందులో హై విజువల్ ఎఫెక్ట్స్ తో చేసినటువంటి బుర్జ్ ఖలీఫా స్టంట్ మాములుగా లేదు. భయానికి భయపడితే ఏదైనా పెద్ద పని ఎలా చేయగలరు అంటూ మహేష్ డైలాగ్ చెబుతూ డ్రింక్ తాగి స్టంట్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా పై నుంచి బైక్ నడపడం హైలెట్ గా నిలిచింది. మహేష్ తన న్యూ యాడ్ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నాడు.

త్వరలోనే స్పెషల్ సాంగ్

త్వరలోనే స్పెషల్ సాంగ్

ఇక సర్కారు పాట సినిమా విషయానికి వస్తే దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ట్రై చేస్తున్నాడు. ఇక సినిమాను మే 12వ తేదీన విసుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ ఫిబ్రవరి 14వ తేదీన మొదటి పాటను రిలీజ్ చేయడానికి థమన్ కూడా సిద్ధమయ్యాడు.

Recommended Video

RRR, Bheemla Nayak Release Dates బాక్సాఫీస్ వార్ | Radhe Shyam | KGF 2 | Filmibeat Telugu

రాబోయే సినిమాలు

సర్కారు వారి పాట సినిమా అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేయడం జరిగింది. ఇక సినిమా తరువాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X