నా స్వీట్ లవ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. సతీమణికి బర్త్‌డే విషెష్ చెప్పిన మహేష్!
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత పుట్టినరోజు నేడు. నమ్రత నేడు 47వ పడిలోకి అడుగుపెట్టారు. సతీమణి పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. నా స్వీటెస్ట్ లవ్ కి జన్మదిన శుభాకాంక్షలు. నా కోసమే ఉన్నా నీపై ఎప్పటికి ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది అని మహేష్ ట్విట్టర్ లో బర్త్ డే విషెష్ తెలియజేశాడు. నమ్రత తనని కౌగలించుకుని ఉన్న ఫోటోని షేర్ చేశాడు.
మహేష్ బాబు నమ్రత 2005లో ప్రేమ వివాహంతో ఇక్కటైన సంగతి తెలిసిందే. వంశి చిత్రంలో వీరిద్దరి జంటగా నటించారు. నమ్రత తెలుగులో వంశీ, అంజి చిత్రాల్లో నటించింది. పలు హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా రాణించింది. మహేష్‌తో వివాహం తర్వాత నమ్రత నటనకు దూరమైంది.

ఇక మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్ బాబు ఈ చిత్రంలో రైతు సమస్యల్ని పరిష్కరించే కార్పొరేట్ సంస్థ అధినేతగా కనిపించబోతున్నాడు. మంచి సందేశాత్మక అంశాలతో వంశీపైడిపల్లి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రానికి నిర్మాతలు. పూజ హెగ్డే ఈ చిత్రంలో మహేష్ సరసన నటిస్తోంది.


Click it and Unblock the Notifications











