SSMB28: ఫ్యాన్స్‌కు మహేశ్ బాబు సర్‌ప్రైజ్.. ఆ ఫొటో బయటకు రావడంతో సంబరాలు

దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలు చేస్తూ.. హవాను చూపిస్తూ దూసుకెళ్తోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దిగ్గజ నటుడి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. దీనికితోడు హ్యాండ్సమ్ లుక్స్‌తో లేడీ ఫ్యాన్స్‌ను కూడా పెంచుకున్నాడు. అంతేకాదు, ఎన్నో హిట్లను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నాడు. ఇక, ఇటీవలీ కాలంలో సూపర్ స్టార్ మహేశ్ వరుసహిట్లను తన ఖాతాలో వేసుకుని భీకరమైన ఫామ్‌తో కనిపించాడు. ఇక, ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా దానిపై అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

సర్కారు వారి పాట ఫలితం ఇలా

సర్కారు వారి పాట ఫలితం ఇలా

వరుస హిట్లతో ఫుల్ జోష్‌ మీదున్న మహేశ్ బాబు.. ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, ఫుల్ రన్‌లో మాత్రం 90 శాతం మాత్రమే వసూళ్లు వచ్చాయి.

త్రివిక్రమ్‌తో మహేశ్ బాబు మూవీ

త్రివిక్రమ్‌తో మహేశ్ బాబు మూవీ

కొన్ని నెలల క్రితమే సూపర్ స్టార్ మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు మాత్రం ఆలస్యంగా జరిగాయి. తర్వాత మహేశ్ గ్యాప్ తీసుకున్నాడు.

షూటింగ్ ఆలస్యం.. అనుమానం

షూటింగ్ ఆలస్యం.. అనుమానం

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే సినిమా షూటింగ్ జరిగి చాలా రోజులే అవుతోన్నా ఇప్పటి వరకూ ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఇక, జూలై నెల నుంచి ఈ సినిమా మొదలు అవుతుందని వార్తలు వచ్చినా అలా జరగలేదు. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ఆరంభం అవుతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

షూటింగ్ ప్రారంభం.. ఫైట్‌తోనే

షూటింగ్ ప్రారంభం.. ఫైట్‌తోనే

మోస్ట్ వెయిటెడ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సెట్స్‌లో ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సీన్ వివరిస్తున్నాడు. ఇక, ఈ షెడ్యూల్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది.

మరో కొత్త లుక్‌లోకి సూపర్ స్టార్

మరో కొత్త లుక్‌లోకి సూపర్ స్టార్


త్రివిక్రమ్ తెరకెక్కించే ఈ సినిమా కోసం మహేశ్ బాబు సరికొత్త లుక్‌తో రెడీ అవబోతున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇప్పుడు అతడు మరో స్టైలిష్ లుక్‌తో కనిపించాడు. తాజాగా మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అందులో సూపర్ స్టార్ వత్తైన జుట్టుతో కొత్తగా కనిపిస్తున్నాడు. దీంతో ఇది బాగా వైరల్ అవుతోంది.

మహేశ్ - త్రివిక్రమ్ మూవీ ఇలా

మహేశ్ - త్రివిక్రమ్ మూవీ ఇలా

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాలో హీరో రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు', 'అర్జునుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X