For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mahesh Babu స్టైలిష్ లుక్.. ఆ అందానికి ఆ ఫేస్ కట్‌కు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి!

  |

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా కనిపించినా కూడా కనురెప్పలు వాల్చకుండా చూసే జనాలు చాలామందే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇప్పటికీ డ్రీం బాయ్ ఎవరు అంటే మహేష్ బాబు తరహాలో ఉండాలి అని అనుకుంటారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పాతికేళ్ళ కుర్రాడి తరహాలోనే దర్శనమిస్తూ ఉన్నాడు అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక ఇటీవల మహేష్ మరొక అల్ట్రా స్టైలిష్ లుక్ తో షాకిచ్చాడు అనే చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్ ఒక స్టైలిష్ బైక్ పై బ్లాక్ డ్రెస్ లో కనిపించడంతో నెటిజన్లు కూడా అదే తరహాలో పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

  స్టామినాను పెంచుకుంటూ..

  స్టామినాను పెంచుకుంటూ..

  టాలీవుడ్ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అంతకు మించి అనేలా కొనసాగిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద కూడా తన స్టామినాను పెంచుకుంటూ వస్తున్నాడు. వీలైనంత వరకు మహేష్ బాబు విభిన్న తరహాలో కథలను సెలెక్ట్ చేసుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ప్లాన్ చేసుకుంటూన్నాడు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి.

  నిమిషాల్లోనే వైరల్

  నిమిషాల్లోనే వైరల్


  మహేష్ బాబు సినిమా వచ్చింది అంటే చాలు అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఏలాంటి పోస్టర్ విడుదల అయినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. ఇక పర్సనల్ ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో అయితే మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ పోస్ట్ చేసే ఫోటోలు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

  బైక్ పై అల్ట్రా స్టైలిష్ లుక్

  బైక్ పై అల్ట్రా స్టైలిష్ లుక్

  రీసెంట్ గా మహేష్ బాబు మరొకసారి కొత్త లుక్ తో అభిమానులకు మంచి కిక్ అయితే ఇచ్చాడు. గతంలో ఒక అభిమాని ఇచ్చిన ట్యాగ్ తోనే మళ్లీ ఇప్పుడు అభిమానులను ఆ డైలాగ్ కూడా వాడుతున్నారు. ఆ అందానికి ఆ ఫేస్ కట్ కు మనం ఇచ్చే వ్యాల్యు ఎంతండి అంటూ.. సరదాగా స్పందిస్తున్నారు. మహేష్ బాబు పూర్తిగా బ్లాక్ కలర్ హైలెట్ అయ్యే విధంగా బైక్ పై కూర్చున్నాడు. 46 ఏళ్ల వయసులో ఇంకా పాతికేళ్ళ కుర్రాడి తరహాలోనే దర్శనమిస్తున్నాడు అంటే మహేష్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  సమ్మర్ కు షిఫ్ట్ అయిన మహేష్

  సమ్మర్ కు షిఫ్ట్ అయిన మహేష్

  గతంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్ బాబు సరికొత్త స్టిల్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అసలైతే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో పోటీ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన మహేష్ మెల్లగా సమ్మర్ కు షిఫ్ట్ అయ్యాడు.

  SSMB 28 రెండో హీరోయిన్ వేట | Sarkaru Vaari Paata ఓవర్సీస్ రేంజ్ || Filmibeat Telugu
  మొదటి పాన్ ఇండియా మూవీ

  మొదటి పాన్ ఇండియా మూవీ


  ఇక ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికే పూర్తి కథను సిద్ధం చేశాడు. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేసేందుకు మహేష్ ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం మొదలు పెట్టబోతున్నారు.

  English summary
  Super star Mahesh babu new stylish look with bike
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X