మాస్టర్ ఈజ్ బ్యాక్.. ప్రశంసలతో ముంచెత్తిన మహేష్ బాబు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల మంచి టాక్ తో దూసుకుపోతున్న ప్రతి చిత్రానికి ప్రోత్సాహం అందిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఆయా చిత్రాల గురించి మహేష్ ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నవాబ్ చిత్రం మహేష్ ట్వీట్ చేశాడు.
దర్శకుడు మణిరత్నంని ప్రశంసలతో ముంచెత్తాడు. నవాబ్ చిత్రం అద్భుతమైన నటనతో కొడుకున్నాడు. ఏఆర్ రెహమాన్ కు మరెవరూ సాటి రాలేరని అర్థం అయింది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ క్లాసిక్ అనిపించే విధంగా ఉంది. చెన్నైలో ఉన్నప్పుడు మణిరత్నం సినిమాలు ఎంజాయ్ చేస్తూ చూసేవాడిని.

నవాబ్ చిత్రాన్ని హోమ్ థియేటర్ లో చూస్తూ ఎంజాయ్ చేశా. మాస్టర్ ఈజ్ బ్యాక్ అని మహేష్ ట్వీట్ చేశాడు. నవాబ్ చిత్రం అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











