సూపర్ స్టైలిష్‌గా సూపర్ స్టార్.. అదరగొడుతున్న మహర్షి సెకండ్ లుక్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. మహేష్ బాబు ఈ చిత్రంలో రిషి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మహర్షి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. మహేష్ బాబు కార్పొరేట్ బాస్ గెటప్ లో అదరగొడుతున్నాడు. మహేష్ నడచి వస్తుంటే చుట్టూ ఉన్న సిబ్బంది అతడి వెనకాలే వస్తున్నారు. సూటు, బూటు, గాగుల్స్ తో మహేష్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు.

వర్షపు చినుకుల మధ్యలో వస్తుండగా మహేష్ కు అతడి సిబ్బంది గొడుగు పడుతున్నారు. ఫస్ట్ లుక్ ని మించేలా, సినిమాపై అంచనాలు పెంచేలా సెకండ్ లుక్ ఉంది. చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ట్వీట్ చేస్తూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిఒక్కరూ మహర్షి జర్నీలో భాగం కావాలని కోరారు.

Super Star Mahesh Babus Maharshi second look released.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రానికి నిర్మాతలు. క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ఈ చిత్రంలో మహేష్ తో రొమాన్స్ చేయనుంది. మహేష్ బాబు మూడు కోణాల్లో నటించే ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 2019 ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X