twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sarkaru Vaari Paata: మరో సరికొత్త రికార్డును అందుకున్న మహేష్ బాబు.. దేశంలోనే టాప్ 3

    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో సర్కారు వారి పాట ఒకటి. మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. గీతగోవిందం బాక్సాఫీస్ హిట్ అనంతరం టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో అయితే గట్టిగానే వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఫస్ట్ లుక్ అయితే సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. టీజర్ లో మహేష్ బాబు అయితే నెవర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని అభిమానులకు ఒక గట్టి నమ్మకం అయితే ఏర్పడింది.

    ఇక ప్రతి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో కూడా సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతున్న అవుతున్నాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధికంగా ట్వీట్ చేసిన హ్యాష్ ట్యాగ్స్ లలో కూడా సర్కారు వారి పాట సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తంలో అత్యధికంగా ట్వీట్ చేయబడిన టాప్ 5 హ్యాష్ ట్యాగ్స్ లలో కూడా స్థానం సంపాదించుకుంది. ఇండియా మొత్తంలో ఎక్కువగా ట్వీట్ చేసిన వాటిలో హ్యాష్ ట్యాగ్స్ లలో సర్కారు వారి పాట మూడో స్థానంలో నిలిచింది. గతంలో కూడా మహేష్ బానుకు సంబంధించిన సినిమాలు చాలా వరకు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈసారి సర్కారు వారి పాట నేషనల్ వైడ్ గా ట్రెండ్ సెట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.

    Super star mahesh babu sarkaru vaari paata top most tweeted hashtag in tfi

    ప్రస్తుతం ఇండియా మొత్తంలో అగ్రస్థానంలో ఉన్న హ్యాష్ ట్యాగ్స్ లలో అజిత్ సినిమా కొనసాగుతోంది. వాలిమై హ్యాష్ ట్యాగ్ అత్యధికంగా ట్వీట్ చేసిన వాటిల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత రెండవ స్థానంలో మాస్టర్ నిలిచింది. అనంతరం సర్కారు బారి పాట హ్యాష్ ట్యాగ్ ఇండియా మొత్తంలో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అజిత్ కుమార్, తలపతి 65 వంటి హ్యాష్ ట్యాగ్స్ టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నాయి. ఇక ఆ తర్వాత ఇతర సామాజిక అంశాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ కొనసాగుతున్నాయి. అయితే ఇండియా మొత్తంలో అత్యధిక గా ట్రెండ్ అయిన వాటిల్లో పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా టాప్ 10లో స్థానం దక్కింది.

    వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా ట్యాగ్ పదవ స్థానంలో ఉంది. తెలుగు సినిమాలకు హీరోలకు ఈరోజుల్లో ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ ఈ ట్రెండ్ రికార్డులను చూస్తేనే చాలా ఈజిగా అర్దమవుతోంది. ఈ స్థాయిలో హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతాయని ఎవరూ ఊహించలేదు. బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇటీవల కాలంలో పెద్దగా వైరల్ కాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట టీజర్ తోనే ఈ స్థాయిలో వైరల్ అయ్యింది అంటే ఇక రానున్న రోజుల్లో సినిమా విడుదల సమయానికి ఏ స్థాయిలో రికార్డులను అందుకుంటుందో చూడాలి. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

    English summary
    Super star mahesh babu sarkaru vaari paata top most tweeted hashtag in tfi,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X