మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్ బాబు.. చిన్నారికి హార్ట్ సర్జరీ
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న మహేష్ బాబు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మహేష్ కేవలం సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా చిన్నారులకు ఒక సూపర్ హీరో అనే చెప్పాలి. వీలైనంత వరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు ఒక దేవుడిలా ప్రాణాలు పోస్తున్నాడు.

గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న చిన్నారులు ఎవరు వచ్చినా కూడా మహేష్ బాబు టీమ్ వెంటనే స్పందిస్తోంది. నమ్రత ఆధ్వర్యంలో వారి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకొని మళ్ళీ ప్రాణాలు పోస్తున్నారు. ఇటీవల సుప్రీత అనే చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించిన విషయాన్ని నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

ఈ సర్జరీతో మొత్తంగా 1022 మంది చిన్నారులను కాపాడిన గొప్ప వ్యక్తిగా మహేష్ అభిమానులు మనసులకు మరింత దగ్గరయ్యాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











