ఎండార్స్మెంట్‌లో దూసుకుపోతున్న మహేష్.. మరో బ్రాండ్‌కు సైన్!
కార్పొరేట్ ఉత్పత్తుల ఎండార్స్ మెంట్ విషయంలో మహేష్ బాబు సౌత్ ఇండియాలోనే రారాజు అని చెప్పొచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు అనేక టాప్ మోస్ట్ కార్పొరేట్ సంస్ధకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. టాలీవుడ్ లో మహేష్ క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. ఇక యాడ్స్ విషయంలో మరే సొంత ఇండియన్ హీరో మహేష్ కు పోటీ ఇవ్వలేకపొతున్నారు. బాలీవుడ్ సార్ షారుఖ్ కూడా మహేష్ ధీటుగా నిలుస్తున్నాడు.
తాజాగా మహేష్ బాబు మరో సంస్థకు బ్రాండింగ్ కల్పించేందుకు సైన్ చేశాడు. డెన్వెర్ డియోడ్రెంట్ సంస్థ తాజాగా మహేష్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. నార్త్ లో ఈ సంస్థకు షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. దీనికి సంబందించిన యాడ్ షూట్ కోసం మహేష్ బాబు త్వరలోనే ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు కార్పొరేట్ సంస్థ అధినేతగా నటించనున్నట్లు తెలుస్తోంది. రైతుల సమస్యలని పరిష్కరించే సందేశాత్మక కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











