పప్పులో కాలేసిన మహేష్ బాబు.. ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ చెప్పబోయి.. చేసిన పొరపాటుకు ఏం చేశాడంటే
రెబల్ స్టార్ ప్రభాస్ 41వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ తారలు వారి బెస్ట్ విషెస్ ని అందిస్తున్నారు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ స్థాయిని పెంచిన రాజమౌళికి ఏ స్థాయిలో గుర్తింపు దక్కిందో అదే తరహాలో ఆ సినిమా కోసం ఐదేళ్లు మరో సినిమాను టచ్ చేయకుండా కష్టపడిన ప్రభాస్ కి కూడా మంచి గౌరవం దక్కింది. కలెక్షన్స్ కంటే కూడా వారి స్థాయి చిరస్థాయిగా నిలుస్తుందనే చెప్పాలి. ఇక మన స్టార్ హీరోలు కూడా ప్రభాస్ కి బర్త్ డే విషెస్ అందిస్తున్నారు.
Recommended Video

మహేష్ బాబు బర్త్ డే విషెస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెబల్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంధించడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. సాధారణంగా మహేష్ అందరి హీరోలతో చాలా ఫ్రెండ్లిగా ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందరి హీరోలకు ఆయన తన విషెస్ అందిస్తున్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ కోసం వేసిన ట్వీట్ కూడా అభిమానులకు ఎంతో కిక్కిచ్చింది.

స్పెషల్ ఫొటో పోస్ట్ చేసి..
ఇక ఇప్పుడు ప్రభాస్ పుట్టినరోజుకు కూడా మహేష్ బాబు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రభాస్! మీకు అనంతమైన విజయం, ఆనందం అలాగే శాంతి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.. అని మహేష్ చాలా ఫ్రెండ్లిగా పేర్కొన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో అర్జున్ సినిమా ఈవెంట్ కి సంబంధించిన ఒక ఫొటో కూడా పోస్ట్ చేశాడు. అప్పుడు ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు.

పొరపాటు చేసిన మహేష్
అంతా బాగానే ఉంది. కానీ మొదట ట్వీట్ చేసినప్పుడు మహేష్ బాబు ఒక పొరపాటు చేశాడు. ప్రభాస్ ఐడి అనుకోని ఎవరిదో ఫేక్ ఎకౌంట్ అడ్రస్ తో ట్యాగ్ చేశాడు. అయితే ప్రభాస్ కి ట్విట్టర్ ఎకౌంట్ లేకపోవడంతో ఆడియెన్స్ షాక్ అయ్యారు. ఆ ఎకౌంట్ ఓపెన్ చేయడంతో రాకేష్ అనే మరో పేరు చూపించింది. ఇక కొద్దీ సేపటికి తన పొరపాటు తెలుసుకున్న మహేష్ వెంటనే ట్యాగ్ తీసేశాడు.

స్టార్ హిరోలందరితో కలిసిపోయే మహేష్
మహేష్ బాబు స్టార్ హిరోలందరితో కూడా స్నేహంగా ఉండాలని కోరుకుంటాడని మరోసారి ఋజువయ్యింది. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, వంటి స్టార్స్ తో కూడా క్లోజ్ గా ఉండే మహేష్ వారి పుట్టినరోజు సందర్భంగా కూడా చాలా సార్లు తన బర్త్ డే విషెస్ అందించాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ కి బర్త్ డే విషెస్ అంధించడంతో అభిమానులు ఆ ట్వీట్ ని వైరల్ అయ్యేలా రీట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











