అభిమానితో మహేష్ బాబు.. వైరల్ అవుతున్న ఫోటో!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. మహేష్ కు లేడీస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ ని చూడాలనే కోరికతో ఓ చిన్నారి అమ్మాయి మహర్షి సెట్స్ కు వెళ్ళింది.
ఆ అమ్మాయిని మహేష్ నిరాశపరచలేదు. ఆమెతో కలసి మహేష్ ఫోటో దిగాడు. ఈ పిక్ నెటిజన్లని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహర్షి చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. రైత సమస్యల అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కామెడీ హీరో అల్లరి నరేష్ ఈ చిత్రంలో మహేష్ స్నేహితుడిగా కీలక పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్ షెడ్యూల్ తరువాత యూఎస్ లో భారీ షెడ్యూల్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 2019 ఏప్రిల్ లో మహర్షి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











