గీత గోవిందంపై మహేష్ ప్రశంసల జల్లులు!
గీత గోవిందం చిత్రం ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. విడుదలకు ముందే గీత గోవిందం చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొనివున్న సంగతి తెలిసిందే. యువత ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూశారు.

గీత గోవిందం చిత్రంపై సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ కూడా చేరారు. మహేష్ బాబు తాజగా గీత గోవిందం చిత్రం చూసి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. సినిమా చివరివరకు ఎంజాయ్ చేశా. తప్పకుండా విజయవంతమైన చిత్రం అవుతుంది. రష్మిక, విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించారు అని మహేష్ ప్రశంసలు కురిపించాడు.
శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించారు. విజయ్ దేవరకొండ డిఫరెంట్ ఆటిట్యూడ్ తో ఆకట్టుకుంటుంటే రష్మిక యువతని మాయ చేస్తోంది.


Click it and Unblock the Notifications











