Lal Salaam మాఫియా డాన్‌గా రజినీకాంత్.. మాణిక్ భాషాను మించిన పాత్రలో తలైవా
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విభిన్నమైన చిత్రాలు, విలక్షణ నటులతో భారీ బడ్జెట్ చిత్రాలతో దూసుకెళ్తున్నది. ఇటీవల పొన్నియన్ సెల్వన్ లాంటి చిత్రాలను రూపొందించిన ఈ నిర్మాణ సంస్థ భారీ విజయాన్ని అందుకొన్నది. ఇండియన్ 2 చిత్రాన్ని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నది.
ఇలాంటి భారీ ప్రాజెక్టులతో లైకా ప్రొడక్షన్స్ ముందుకెళ్తునే సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్ లాల్ సలాం శరవేగంతో రూపొందిస్తున్నది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్నారు. ఈ సినిమాకు సంబంధఇంచిన తలైవా రజనీకాంత్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లాల్ సలాం చిత్రంలోని మొయిద్దీన్ భాయ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే ముస్లిం వృద్దుడి గెటప్‌లో రాయల్‌గా నడిచి వచ్చే రజినీకాంత్ ఫ్యాన్స్ కిరాక్‌కు పట్టించింది. మాస్ గెటప్ రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. భాషా మూవీలో మాణిక్ భాషాగా నటించిన సూపర్ స్టార్ ఇప్పుడు లాల్ సలాంలో మొయిద్దీన్ భాయ్‌గా డాన్ పాత్రలో మెప్పించబోతున్నారు.
లాల్ సలామ్ సినిమా షూటింగ్ కోసం మరోసారి రజనీకాంత్ ముంబైలో అడుగుపెట్టారు. ముంబైలో మాఫియా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మోయిదీన్ భాయ్‌గా కనిపించనున్నారు. గతంలో ముంబైలో మాఫియా డాన్‌గా వ్యవహరించిన ఓ ముస్లిం జీవిత కథగా ఈ సినిమా తెరకెక్కించే ప్రయత్నం జరుగుతున్నది.
లైకా ప్రొడక్షన్ ప్రతినిధులు మాట్లాడుతూ... డిఫరెంట్ చిత్రాలను అందించటానికి మా లైకా ప్రొడక్షన్ష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. లాల్ సలాం విషయానికి వస్తే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజినీకాంత్ మొయిద్దీన్ భాయ్ అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు రామస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు అని తెలిపారు.
నటీనటులు: రజినీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఐశ్వర్య రజినీకాంత్
నిర్మాత: సుభాస్కరన్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫి: విష్ణు రంగస్వామి
ఎడిటింగ్: బీ ప్రవీణ్ భాస్కర్
ఆర్ట్: రాము తంగరాజ్


Click it and Unblock the Notifications











