Rajinikanth: మూలాలు మరువని సూపర్ స్టార్ రజనీకాంత్... అక్కడికి వెళ్లి మరీ...

సూపర్ స్టార్ రజినీ కాంత్ ను ఫ్యాన్స్ ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. ఇక ఆయనకు తమిళనాడులో అంతా ఇంతా క్రేజ్ కాదు.. ఓ దేవుడిలా కోలుస్తారు. ఆయన సినిమా అంటే అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటిస్తుంది. మరి అంతటి క్రేజ్ ఉన్న రజినీ కాంత్... నేడు బెంగళూరులోని ఓ బస్ స్టాప్ లో దర్శనమిచ్చారు. ఇక ఆయన్నీ చూసిన జనం.. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే...

రజినీ కాంత్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన 1950 డిసెంబరు 12న జన్మించారు. ఆయనకు అమ్మనాన్నలు పెట్టిన పేరు శివాజీరావ్‌ గైక్వాడ్‌. రాణోజీరావు, రాంబాయి దంపతులకు పుట్టిన శివాజీరావ్‌.. మధ్య తరగతి జీవనాన్నే సాగించాడు. ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయిన ఆయన... ఇంట్లో ఎన్నో గొడవలు, దూషణలు ఎదురవడంతో చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు.

Super Star Rajinikanth Surprises Fans With Visit To JayaNagar BMTC Depot Videos Viral

'ఎంత చెడ్డవారిలోనైనా ఎప్పుడో ఒకప్పుడు మార్పొస్తుంది' అన్నది శివాజీరావ్‌ విషయంలోనూ నిజమైంది. రామకృష్ణ మఠం ఆయనలో సత్ప్రవర్తన, ఆధ్యాత్మికతకు బీజాలు వేసింది. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో శివాజీ ఎస్‌ఎస్‌ఎల్‌సీ తర్వాత చదువు కొనసాగలేదు. దొరికిన పని చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ క్రమంలో కేఎస్‌ ఆర్టీసీలో బస్‌ కండక్టర్‌గా మారారు. ఆ ఉద్యోగమే శివాజీరావ్‌ ను రజనీ కాంత్‌ అయ్యేలా చేసింది. భారతీయ సినిమా గర్వపడే నటుణ్ని అందించింది.

Super Star Rajinikanth Surprises Fans With Visit To JayaNagar BMTC Depot Videos Viral

ఇప్పుడు ఆయన ఆ మూలాలు మరవలేదని తెలుస్తోంది. ఒకప్పుడు కండక్టర్ గా ఉద్యోగం చేసిన రజినీ కాంత్... ఇప్పుడు అదే ప్లేస్ కు వెళ్లి బీఎమ్‌టీసీ బస్ స్టాండ్ ను సందర్శించారు. బెంగళూరులోని బస్ డిపోను మంగళవారం ఆకస్మికంగా సందర్శించిన సూపర్ స్టార్ రజనీకాంత్ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) సిబ్బందికి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు.

Super Star Rajinikanth Surprises Fans With Visit To JayaNagar BMTC Depot Videos Viral

ఆగస్టు 29వ తేదీన ఉదయం 11.30 గంటలకు బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ డీపోను చూసిన రజినీ... BMTC సిబ్బందితో సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అతనితో సెల్ఫీలు తీసుకున్నారు. ఒకప్పుడు ఇదే బస్ స్టాండ్ లో కండక్టర్ గా పనిచేసిన రజినీ... ఇప్పుడు తలైవా అయ్యారు. ఆయన్ని చూసిన స్థానికులు ఫుల్ ఖుషి అయిపోయారు.

Super Star Rajinikanth Surprises Fans With Visit To JayaNagar BMTC Depot Videos Viral

ఇక రజినీ నటించిన జైలర్ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోస్తుంది. నెల్సన్ దిలీప్ కూమర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ అయింది. ఇక ఈ మూవీకి థియేటర్ల వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ తెరకెక్కించారు. ఇక జైలర్ ఇప్పటికే 600 కోట్ల రూపాయాలను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X