ఇంటర్వెల్ సీన్స్ మొదలు పెట్టిన మహేష్.. మహర్షిలో పాత్ర ఇదే!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి అమెరికా షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. చిత్ర యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే షూటింట్ ప్రారంభించేసారు.
ప్రస్తుతం మహర్షి చిత్రానికి సంబందించి ఇంటర్వెల్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన అద్భుతమైన సెట్ లో ఈ షూటింగ్ జరుగుతోందట. అమెరికా నుంచి వచ్చిన ఓ కంపెనీ అధినేతగా మహేష్ కనిపిస్తాడట. రైతు సమస్యలపై ఈ చిత్రం ఉండబోతోందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అమెరికాలో ఉన్న బడా కంపెనీ సీఈఓకు, ఇండియాలో రైతు సమస్యలకు ఏంటి సంబంధం అనే ఉత్కంఠ నెలకొని ఉంది. భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











