మహేశ్​ - నమ్రత పెళ్లికి ఆ కండిషన్​తో సూపర్ స్టార్ కృష్ణ హైడ్రామా... చివరకు ఆమె ఎంట్రీతో పెళ్లి!

టాలీవుడ్‌లో మోస్ట్‌ లవబుల్‌ అండ్‌ బెస్ట్ కపుల్ అనగానే సూపర్ స్టార్ మహేశ్​ బాబు, నమ్రతా శిరోద్కర్ పేర్లే ముందుగా అందరికీ గుర్తొస్తాయి. నేడు ఈ క్యూట్ కపుల్​ 19వ వివాహ వార్షికోత్సవం. అయితే వీరి ప్రేమ పెళ్లి వెనక ఓ పెద్ద డ్రామానే జరిగింది. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఈ జంట పెళ్లికి ఓ కండిషన్ పెట్టారట. దీంతో చివరకు వీరిద్దరి పెళ్లి ఆమె ఎంట్రీ వల్ల జరిగిందని తెలిసింది. ఈమె చెప్పడం వల్లే కృష్ణ.. మహేశ్​ - నమ్రత పెళ్లికి ఒప్పుకున్నారట. దాని గురించి ఈ కథనం..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ బడా ఫ్యామిలీల్లో ఘట్టమనేని కుటుంబం కూడా ఒకటి. సూపర్ స్టార్ కృష్ణ తన అందం, నటనతో ఎంతో మంది ప్రేక్షకుల్ని సంపాదించుకున్నారు. తెలుగు చిత్ర సీమలో ఓ సరికొత్త ట్రెండ్​ను సెట్ చేశారు. ఆయన తర్వాత సూపర్ స్టార్​ మహేశ్​ బాబు కూడా ఇదే రేంజ్​లో స్టార్​ డమ్​ను అందుకుని కృష్ణ నటన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్న సినిమాతో గ్లోబల్ వైడ్​గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Superstar Krishna Condition For Mahesh Babu Namrata Marriage News Goes Viral

అయితే మహేశ్​ది ప్రేమ పెళ్లి అన్న సంగతి తెలిసిందే. హీరోయిన్​ నమ్రత శిరోద్కర్​తో ఈయన పెళ్లి బంధం ఏర్పడి దాదాపు 19ఏళ్లు అయింది. ఈ జంటకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ ఇద్దరు తమ ప్రేమ, పెళ్లి జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతూ ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరీ ప్రేమాభిమానాలను పొందుతున్నారు.

అయితే ఈ ఇద్దరి పెళ్లి అంత ఈజీగా జరగలేదు. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి ఎంత హడావిడిగా ఉంటుందో తెలిసిందే. కానీ మహేశ్ - నమ్రత పెళ్లి సింపుల్​గా జరిగిపోయింది. ఎందుకంటే మొదట సూపర్ స్టార్​ కృష్ణకు ఈ పెళ్లి ఇష్టం లేదట. వంశీ సినిమా షూటింగ్ సమయంలోనే మహేశ్​ బాబు - నమ్రత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పుడు తమ ప్రేమ విషయాన్ని కృష్ణకు చెప్పారట. కానీ సూపర్ స్టార్ మాత్రం ససేమీరా అన్నారు. కానీ ఆ తర్వాత మహేశ్​ సోదరి ఘట్టమనేని మంజుల ఎంట్రీ ఇచ్చి కృష్ణను బాగా కన్విన్స్ చేసిందట. అప్పుడు జేమ్స్ బాండ్ అయిన కృష్ణ వీరి పెళ్లికి ఒప్పుకున్నారట. కానీ పెళ్లి జరిగే ముందు ఓ కండిషన్ పెట్టారట. అదేంటంటే ఇద్దరు స్టార్ స్టేటస్​ అందుకున్నాక చేసుకోవాలని అన్నారు.

కానీ ఆ తర్వాత కృష్ణకే ఆ కండీషన్ మరీ అంత కన్విన్సింగ్​గా అనిపించక వద్దులే అన్నారట. వాస్తవానికి మహేశ్ - నమ్రత మొదట రహస్యంగా ముంబయిలో పెళ్లి చేసుకున్న సంగతి చాలా మందికి తెలిసిన విషయమే. తర్వాత ఘట్టమనేని మంజుల ప్రోత్సాహంతో ఈ జంటకు మళ్ళీ వివాహం చేసి ఆశ్వీర్వదించారు కృష్ణ. ఈ జంట ప్రేమ, పెళ్లి బంధానికి గుర్తుగా కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితార జన్మించారు.

Superstar Krishna Condition For Mahesh Babu Namrata Marriage News Goes Viral

ఇక నేడు మహేశ్ - నమ్రత తమ పెళ్లి రోజు ఒకరినొకరు సోషల్ మీడియా వేదికగా విష్​ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. అలానే నేడు కూడా చేసుకున్నారు. నమ్రతా ఒక అందమైన పప్పీల జంట వీడియోతో ఎంతో క్యూట్​గా విషెస్‌ చెప్పింది. అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X