twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో అరుదైన ఘనత: సౌత్ నుంచి తొలి హీరో మహేష్ బాబు!

    |

    Recommended Video

    Mahesh Joins Times Most Forever Desirable Club || Filmibeat Telugu

    సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమను వరుస విజయాలతో ఏలుతున్న టాప్ స్టార్. ఇక అందం పరంగా ఆయన్ను బీట్ చేసే హీరో సౌత్ ఇండస్ట్రీలో మరొకరు లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో! మహేష్ వయసు రోజు రోజుకు తగ్గుతుందే తప్ప పెరిగిట్లు కనిపించడం లేదు.. దీని వెనక రహస్యం ఏమిటీ? అని సందేహ పడేవారు కోకొల్లలు.

    ఇటీవల విడుదలైన 'మహర్షి' చిత్రంలో మరోసారి తన హ్యాండ్సమ్ లుక్‌తో మహేష్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు. యంగ్ జనరేషన్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్, లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కలిగిన హీరోగా ఇప్పటికే కీర్తి గడించిన ఈ తెలుగు సూపర్ స్టార్ మరో అరుదైన ఘనత దక్కించుకున్నారు.

    ‘టైమ్స్‌ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌'లో మహేష్

    ‘టైమ్స్‌ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌'లో మహేష్

    తాజాగా మహేష్ బాబు ‘టైమ్స్‌ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌'లో చోటు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఈ లిస్టులో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, ఆమిర్‌ ఖాన్‌ లాంటి వారు మాత్రమే ఉన్నారు, ఇపుడు ఇందులో మహేష్ పేరు కూడా చేరిపోయింది.

    సౌత్ నుంచి తొలి హీరో...

    సౌత్ నుంచి తొలి హీరో...

    ‘టైమ్స్‌ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌'లో చోటు దక్కించుకున్న తొలి సౌత్ హీరో మహేష్ బాబే కావడం విశేషం. ఈలిస్టులో చోటు దక్కడం అంటే మామూలు విషయం కాదు, సినిమాల పరంగా ఫాంలో ఉండటంతో పాటు దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకుల మెప్పు పొందిన వారికి మాత్రమే ఇందులో చోటు ఉంటుంది.

    ప్రత్యేకంగా ఈ లిస్టు ప్రవేశ పెట్టిన టైమ్స్

    ప్రత్యేకంగా ఈ లిస్టు ప్రవేశ పెట్టిన టైమ్స్

    టైమ్స్ సంస్థ ప్రతి ఏడాది 50 మంది పేర్లతో కూడిన మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ‘ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌'లో ఉన్నవారికి 50తో కూడిన లిస్టులో ఉండదు. ఒక అలా చేస్తే ఎప్పుడూ వారే టాప్‌లో ఉంటారు. అందుకే ప్రత్యేకంగా ‘టైమ్స్‌ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌' క్రియేట్ చేశారట.

    మహర్షి

    మహర్షి

    మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘మహర్షి' బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. 8 రోజుల్లో ఈ మూవీ రూ. 150 కోట్లకుపైగా గ్రాస్, రూ. 80 కోట్లకుపైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. ఫుల్ రన్‌లో ఈ మూవీ మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలవనుంది.

    మహేష్ బాబు అభిమానులు హ్యాపీ

    మహేష్ బాబు అభిమానులు హ్యాపీ

    ‘టైమ్స్‌ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌'లో తమ అభిమాన హీరో చేరడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఆ సత్తా ఉన్న స్టార్ ఆయన మాత్రమే అని, అందం పరంగా, ఫేం పరంగా మా హీరోను మించినవారు లేరని గర్వంగా చెబుతున్నారు. టైమ్స్ సంస్థ ఈ విషయం ప్రకటించగానే సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది.

    English summary
    Superstar Mahesh Babu is the first South Indian actor to join the 'Times Most Forever Desirable Club'. Mahesh Babu is an Indian actor, producer, media personality, and philanthropist known for his works in Telugu cinema. He owns the production house G. Mahesh Babu Entertainment Pvt. Ltd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X