అప్పుడే 18 ఏళ్లు .. మహేశ్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్టు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu),నమ్రత (Namrata Shirodkar) దంపతుల కొడుకు గౌతమ్ ఘటమనేనీ (Gautam Ghattamaneni) బర్త్ డే నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో తన కొడుకుకి కొన్ని విషయాలు తెలుపుతూ.. తాను గౌతమ్ విషయంలో ఎంతో ఆనందపడుతున్నానని ఇంట్రెస్టింగ్ గా పోస్టు చేశారు. ఇంతకీ ఆ పోస్టు ఎలా ఉందో.. ఏ విషయంలో గౌతమ్ తన తండ్రి మహేష్ ను ఇంప్రెస్ చేశాడో మీరు కూడా చూసేయండి.
హీరో మహేశ్ బాబు తన కొడుకు కొడుకు గౌతమ్ ఘటమనేనీకు ట్వీట్టర్ వేదికగా విషెష్ తెలిపారు. 'హ్యాపీ 18 మై సన్. ఈ సమయాన్ని ఆస్వాదించు. ఎన్నో విషయాలు అన్వేషించు. లవ్ యూ సో మచ్. ఒక తండ్రిగా ఈరోజు నేనెంతో ఆనంద పడుతున్నా'' అని పోస్ట్ పెట్టారు. హీరోయిన్ నమ్రత కూడా తన తనయుడు గౌతమ్ కు ఇన్‌స్టా వేదికగా విషెస్ చెప్పారు. ''హ్యాపీ బర్త్‌డే మై సన్. నీ విషయంలో మేమెంతో సంతోషంగా ఉన్నాం. ఈ సమయం నీ జీవితంలో ఎంతో ముఖ్యమైంది. చాలా ప్రత్యేకమైనది. నీవు నిర్ణయించుకున్న లక్ష్యాలను చేరుకుంటూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండూ. లవ్ యూ'అని రాసుకొచ్చింది నమ్రత.

గౌతమ్ ఘటమనేనీ కూడా ఇటు చదువులోనూ.. అటు నటనలో రాణిస్తున్నారు. '1 నేనొక్కడినే'తో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. గౌతమ్ ను హీరోగా సిల్వర్ స్క్రీన్ పై క్షణం కోసం ఎదురుచూస్తున్నారు ఘటమనేని ఫ్యాన్స్. ఇక హీరో మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం లెజండరీ డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం సిద్దమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అయితే.. షూటింగ్ ప్రారంభం అవుతుందో అనే విషయాన్ని మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతోన్నారు. ఈ ఏడాదిలో కచ్చితంగా ప్రారంభమతుందని ప్రిన్స్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.


Click it and Unblock the Notifications











