SSMB 29: మహేశ్ మళ్లీ కొత్త లుక్​... ఏంది భయ్యా ఇలా మారిపోయాడు.. అంతా రాజమౌళి కోసమే!

సూపర్ స్టార్ మహేశ్​ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయసులోనూ 20ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు కొత్త కొత్త లుక్స్​లో కనపడిన మహేశ్ బాబు ఇప్పుడు మళ్లీ ఎవరూ ఊహించని రేంజ్​లో సూపర్ న్యూ లుక్​లోకి మారారు! దాని గురించే ఈ కథనం..

రీసెంట్​గా సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూపర్ స్టార్ మహేశ్​ బాబు. ఈ సినిమా కంటెంట్ పరంగా కాకపోయినా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను అందుకుంది. ఇక ఈ సినిమా పూర్తైన నేపథ్యంలో ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారాయన. అయితే ఈ చిత్రం కోసం ఇప్పటికే ఆయన గత కొంత కాలంగా తన లుక్ విషయంలో మహేశ్ చాలా కేర్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Superstar Mahesh Babu New Look With Beard And Long Hair Photos Goes Viral

సాధారణంగానే మహేశ్​కు జిమ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కసరత్తులు చేస్తుంటారు. రాజమౌళి సినిమా కోసం ఇప్పుడు మరింత ఎక్కువ సేపు జిమ్​లో గడుపుతున్నారు. తన బాడీ ఫిజిక్​ను మారుస్తున్నారు. లుక్స్​ను కూడా రోజురోజుకు మారుస్తున్నారు. అలా తాజాగా మరో కొత్త లుక్​ కూడా బయటకు వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఛేంజ్ చేస్తున్నారు. ఇది చూసిన అభిమానులు మళ్లీ ఫిదా అవుతున్నారు.

ఈ మధ్యే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన అన్న కొడుకు ఆశిష్ పెళ్లికి పిలవడానికి మహేశ్​ ఇంటికి వెళ్లారు. మహేశ్ కుటుంబానికి పెళ్లి కార్డ్​ ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్​-నమ్రతలతో దిల్​ రాజు దిగిన ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పిక్​ ఇప్పుడు వైరల్​గా మారింది. ఇందులో మహేశ్​ తన న్యూ లుక్​లో దర్శనమిచ్చారు. ఇందులో మహేశ్ బాగా జుట్టు పెంచి, గడ్డం కూడా బాగా పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది.

అయితే హెయిర్ స్టైల్​ ఎక్కువగా కనపడకుండా టోపీ పెట్టారు మహేశ్. వాస్తవానికి మహేశ్​ లాంగ్​ హెయిర్, గడ్డంతో చాలా తక్కువగానే కనిపిస్తారు. అందుకే మహేశ్​ను ఇప్పుడలా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ లుక్ రాజమౌళి సినిమా కోసమేనని ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి దర్శకధీరుడు జక్కన్న మహేశ్​ బాబును ఎలా చూపిస్తారో...

కాగా, మహేశ్​ - రాజమౌళి సినిమా ప్రకటించినప్పటి నుంచి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఫారెస్ట్ బ్యాక్​డ్రాప్​లో యాక్షన్ అడ్వెంచర్ ఉంటుందని ఇప్పటికే రాజమౌళి తెలిపారు. కథ కూడా పూర్తైంది. మ్యూజిక్ సిట్టింగ్స్​ మొదలయ్యాయి. ఈ సినిమా దాదాపు రూ.1000కోట్ల బడ్జెట్​తో తెరకెక్కనుందని తెలుస్తోంది. సినిమాలో హాలీవుడ్​ ప్రముఖులు కూడా భాగస్వామ్యమవుతున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X