twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రికెట్ ఆడిన మహేశ్.. వీడియో షేర్ చేసిన డైరెక్టర్.. బ్యాట్ మరీ చిన్నగా ఉందంటూనే బాదేశాడు

    |

    సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. రెండు రోజుల క్రితం అతడి పుట్టినరోజును పురస్కరించుకుని ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ లుక్, ఆర్మీ మేజర్ గెటప్ ఆకట్టుకుంది.

    ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి, ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Superstar Mahesh Babu Played Cricket With Directors

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను అనిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'మహేశ్ బాబు, గౌతమ్, డైరెక్టర్లు మెహర్ రమేశ్, వంశీ పైడిపల్లితో కలిసి కశ్మీర్‌లో ఎంతో ఎంజాయ్ చేశాను. గౌతమ్ నన్ను బౌల్డ్ చేశాడు' అంటూ దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.

    ఇందులో మొదట మహేశ్ బ్యాటింగ్ చేశాడు. ఆ సమయంలో 'బ్యాట్ ఏంటండి మరీ చిన్నగా ఉంది' అని మాట్లాడడం వినిపించింది. ఆ తర్వాత బౌలింగ్ కూడా వేశాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వృత్తి పరంగా ఎంతో స్ట్రిక్ట్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఖాళీ సమయాల్లో మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడీ వీడియో బయటకు రావడంతో దీనిపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో ఈ వీడియోను సూపర్ స్టార్ అభిమానులు షేర్ చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

    English summary
    Tollywood Superstar Mahesh Babu and his Sarileru Neekevvaru team are quite happy that they have wrapped their Kashmir schedule of the movie before PM Narendra Modi gave a shocker to the whole nation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X