Rajinikanth Birthday: అదిదా తలైవా.. రజినీకాంత్ ఆస్తలు విలువ ఎంతో తెలుసా?

సౌత్ సినిమా ఇండస్ట్రీ ఆరాధ్య దైవ సూపర్ స్టార్ రజినీ కాంత్ పుట్టిన రోజు నేడు. ఆయనకు ఒక్క సౌత్ మాత్రమే కాదు.. ఇండియా, ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా తలైవాకు అభిమానులు నీరాజనం పలుకుతారు. బస్ కండక్టర్ నుంచి మొదలైన ఆయన ప్రయాణం.. ఆ తర్వాత సూపర్ స్టార్ ను చేసింది. ఆయన ఎంతో మందికి ఆదర్శం స్పూర్తినీయం. అలాంటి వ్యక్తి ఆస్తులు, నెట్ వర్త్ ఎంత ఉంటుందో ఓ స్పెషల్ స్టోరీ చూద్దాం.

సూపర్ స్టార్ రజినీ కాంత్... 1950 డిసెంబరు 12న బెంగళూరులో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీరావ్‌ గైక్వాడ్‌. రాణోజీరావు, రాంబాయి దంపతులకు పుట్టిన శివాజీరావ్‌.. మధ్య తరగతి కుటుంబంలో జీవితాన్ని సాగించాడు. ఆరేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయినా... ఇంట్లో ఎన్నో గొడవలు, దూషణలు ఎదురైనా... చెడు తిరుగుళ్లకు అలవాటు పడినా... ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగాడు. దానికి కారణం... 'ఎంత చెడ్డవారిలోనైనా ఎప్పుడో ఒకప్పుడు మార్పొస్తుంది' అనే విషయంలో రజినీకాంత్ నిజం చేశాడు.

Superstar Rajinikanth Birthday Special: Thalaiva Turns 73 Net Worth And Assets Full Details Here

బస్ కండక్టర్ నుంచి.. సినిమాలపై ఇంట్రెస్టుపై సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. అంతేకాదు ఎందరికో జీవితాలను ప్రసాదించాడు. అంతటి ఉన్నతమైన వ్యక్తి రజనీకాంత్‌ అనడంలో సందేహం లేదు. ఇక రజనీకాంత్ అనేక దశాబ్దాలుగా ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నాడు. అతని స్టైలంటే ప్రజలను ఎంతో ఇష్టం. 1975లో అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రజినీ.... అప్పటి నుంచి ఎన్నో చిత్రాలు తెలుగు,తమిళ్, హిందీ పరిశ్రమలో తనదైన ముద్ర చాటుకున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ 2010 సంవత్సరంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. అతని మొత్తం ఆస్తులు 52 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 430 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం రజనీ ఒక్క సినిమాకు 50 నుంచి 100 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఒక వేళ సినిమా బాగా రాకపోతే తాను తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తారని సమాచారం.

ఇక రజినీ కాంత్ కు చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో విలాసవంతమైన ఇల్లు ఉండగా.. దీన్ని 2002లో నిర్మించుకున్నాడు. ప్రస్తుతం దాని విలువ సుమారు 4.2మిలియన్ డాలర్లు అనగా.. దాదాపు రూ.35కోట్లు. అలాగే ఆయనకు రాఘవేంద్ర మండపం అనే కళ్యాణ మండపం కూడా ఉండగా.. ఇందులో 275 మంది అతిథులు, 1000 మందికి పైగా ఆహ్వానితులు కూర్చునే సామర్థ్యం ఉంది. దీని విలువ దాదాపు రూ.20కోట్లు ఉంటుందని సమాచారం.

సూపర్ స్టార్ వద్ద రెండు రోల్స్ రాయిస్ సహా అనేక లగ్జరీ కార్లు ఉన్నాయట. రూ.6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, రూ.16.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉన్నాయని.. అవే కాకుండా టయోటా ఇన్నోవా, హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని వంటి కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అత్యంత ఖరీదైన వాహనాల్లో రూ. 1.77 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, రూ. 2.55 కోట్ల విలువైన మెర్సిడెస్, రూ. 3.10 కోట్ల విలువైన లంబోర్గినీ ఉరస్ ఉన్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఎన్ని ఆస్తులు ఉన్న ఒదిగి ఉండే తర్వం సూపర్ స్టార్. అందుకే ఆయన్ని తలైవా అంటారు ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X